సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పర్యటనలో నేడు, బుధవారం స్థానిక జిల్లా టీడీపీ కార్యా లయంలో జిల్లా టీడీపీ అడ్జక్షురాలు , తోట సీతారామ లక్ష్మి ఆధ్వర్యంలో జిల్లా లోని 7 నియోజకవర్గాల టీడీపీ ఇంచార్జి లతో జనసేనాని పవన్ కళ్యాణ్ సమావేశం అయ్యారు కానీ భీమవరంలోని స్థానిక టీడీపీ నేతలతో సమావేసం కాకపోవడం పవన్ బిజీ షెడ్యూలు వల్ల వెళ్లిపోవడంతో స్థానిక భీమవరం మాజీ మున్సిపల్ వైస్ చైర్మెన్ మెంటే గోపి తో సహా మాజీ మునిసిపల్ కౌన్సెలర్స్ పలువురుమరియు వీరవాసరం టీడీపీ నేతలు మాజీ మంత్రి పితాని సత్యనారాయణ ఫై తీవ్ర అసహనం వ్యక్తం చేసారు. జనసేన అడ్జక్షుడు కోటికల పూడి చినబాబు వారితో మరోసారి తప్పకుండ భేటీ ఏర్పాటు చేస్తామని పరిస్థితి అర్ధం చేసుకోమని విజ్ఞప్తి చేసారు. ..పవన్ తో సమావేశం అంటే ఉదయం నుండి వేచి చూస్తున్నామని, ఇప్పడే ఆయన ఇలా ఉంటె పార్టీలో వేరే సంకేతాలు వస్తాయని, మమ్మ ల్నే కలవకపోతే ప్రజలని ఎలా కలుస్తారంటూ టీడీపీ నేతలు ఆగ్రహం వ్య క్తం చేశారు. మాజీ మంత్రి పితాని సత్య నారాయణ సర్ది చెప్పే ప్రయత్నం చేశారు.ఇకపై మం డలాల వారీ మీటింగ్ పెట్టండి అంటూ భీమవరం నేతలు డిమాండ్ చెయ్యడం తో అప్పటి వరకు సహనంతో ఉన్న పితాని సత్య నారాయణ తీవ్ర ఆగ్రహం తో మీరెవరు ఎక్క డ మీటింగ్ పెట్టాలో చెప్పడానికి.?. కాస్త సహనంగా ఉండటం తెలీదా? అంటూ ప్రశ్నించారు.
