సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: జనసేనాని పవన్ కళ్యాణ్ భీమవరం పర్యటనలో జనసేన నేతలనుద్దేశించి చేసిన ప్రసంగంలో వైసిపి పార్టీ ఫై పలు అభ్యన్తరకర వ్యాఖ్యలు చేసారని భీమవరంలో వైసీపీ కార్యాలయంలో స్థానిక ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ గతం భీమవరం లో ఓడిపోయిన తరువాత హైదరాబాద్ లోని నివాసానికి పరిమితం అయ్యారని గత ఏడాదిగా మాత్రమే 3 సార్లు వచ్చారని, కొరోనా అప్పుడు, భారీ వర్షాలతో ఎప్పుడైనా ఇక్కడకు వచ్చి ఎవరినైనా పరామర్శించారా? ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయి ఎలాగయినా తాను భీమవరం నుండి గెలవడం కోసం తనకో ‘ప్యూహం’ ఉందని దానికోసం అటు చంద్రబాబు ను ప్రధాని మోడీ ని కలుసుకొని వారితో పొత్తు పెట్టుకొని ఇక్కడ స్థానికంగా ఇల్లు కొనుకొంటానని భీమవరం లోకల్ అయిపోతానని ఇంతా హడావిడి చేస్తున్నాడని ఇందంతా ఎవరిని మోసం చేయడానికని ప్రశ్నించారు. నేను లోకల్ రియల్ హీరో నని సీఎం జగన్ భీమవరం బహిరంగ సభలో చెప్పిన విషయం గుర్తు చేసారు. భీమవరంలో, అమలాపురంలో కృష్ణ జిల్లాలో అక్కడి 3రకాల సామజిక వర్గాలతో కాపులకు గొడవ ఉందని పవన్ పేర్కొనడం ప్రమాదకరమని .. కులాల మధ్య ఆయనే చిచ్చు పెట్టి ఓట్లు దండుకోవాలని చూస్తున్నారని విమర్శించారు. పొత్తులో భాగంగా పిలిచి..ఇక్కడ టీడీపీ లో సుదీర్ఘ కాలంపనిచేస్తున్న మాజీ ప్రజాప్రతినిధులను సమావేశానికి పిలిచి వారిని పట్టించుకోకపోయిన వ్యక్తి రేపు భీమవరం ప్రజలను ఏమి ఉద్ధరిస్తాడని ప్రశ్నించారు. తాను భీమవరం పట్టణం కోసం చేసిన అబివృద్దీ , రాష్ట్రంలో సీఎం జగన్ చేసిన ప్రజారంజక పాలన కె ప్రజలు మరోసారి పట్టం కడతారని ధీమా వ్యక్తం చేసారు ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్.
