సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఏపీలో అసెంబ్లీ ఎన్నికలతో పాటు దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్ని కలకు మరికొన్ని రోజులు మాత్రమే సమయం ఉంది. ఈ నేపథ్యం లో ఏ క్షణానైనా కేంద్ర ఎన్నికల సంఘం నుంచి షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే, మార్చి 13 తర్వాత ఈసీ ఎన్నికల తేదీలను ప్రకటిం చే అవకాశం ఉన్న ట్లు సమాచారం. సార్వ త్రిక ఎన్నికల సంసిద్ధతను అంచనా వేయడానికి ఎలక్షన్ కమిషన్ పలు రాష్ట్రాల్లో పర్యటిస్తోందని, ఇంకా తమిళనాడు, జమ్మూ కశ్మిర్ రాష్ట్రాలలో పర్యటించవలసి ఉంది. అది పూర్తయిన వెంటనే ఎన్నికల తేదీలను ప్రకటిస్తామని ఎన్నికల సంఘం అధికారులు నేడు, శుక్రవారం తెలిపారు. ఇటీవల కేంద్ర ఎన్నికల సంఘం , వివిధ రాష్ట్రాల ఎన్నికల అధికారులతో క్రమం తప్పకుండా సమావేశాలను నిర్వ హిస్తున్నారు. ఈసారి సోషల్ మీడియా, ఇతర డిజిటల్ ప్లాట్ పారమ్స్ లో తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టేందుకు ఏఐ టెక్నాలజీని ఉపయోగించనున్నట్లు తెలుస్తోంది. మే నెలలో లోక్సభ ఎన్నిలకు జరిగే అవకాశం ఉంది. దేశం మొత్తం 96.88 కోట్ల మంది ప్రజలు ఓటేసేం దుకు సిద్ధంగా ఉన్నారు. .
