సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: తాడేపల్లి గూడెం సమీపంలోని ప్రత్తిపాడు వద్ద జాతీయరహదారిని అనుకోని 21 ఎకరాల్లో ఈనెల 28న జనసేన, తెలుగుదేశం ఉమ్మడి భారీ బహిరంగ సభ ఏర్పాట్లు నేడు, శుక్రవారం ప్రారంభించారు. ఉభయ పార్టీలకు చెందిన 50 మంది నేతలు అస్సినులయ్యేలా భారీ వేదిక ను ఏర్పాటు చేస్తున్నారు. అయితే ట్విస్ట్ ఏమిటంటే .. టీడీపీ , జనసేన నేతలు వేరువేరుగా వారి వారి ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ తో సహా 50 మంది నేతలు అస్సినులయ్యేలా భారీ వేదిక ను ఏర్పాటు చేస్తున్నారు. జనసేన పిఏసి ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ఏర్పాట్లను దగ్గరుండి సమిక్షించారు. వారి వెంటా తాడేపల్లి గూడెం అసెంబ్లీ జనసేన అభ్యర్థిగా భావిస్తున్న బొలిశెట్టి శ్రీనివాస్ మరియు తణుకు జనసేన నేత విడివాడ ,కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే రామారావు, అత్తారింటికి దారి .. నిర్మాత బి వి ఎస్ ప్రసాద్ తదితర జనసేన నేతలు ఉన్నారు. నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ..స్థానిక పెద్దలు కృష్ణమూర్తి తన 21 ఎకరాల స్థలాన్ని బొలిశెట్టి శ్రీను అడగగానే ఇచ్చారని కృతఙ్ఞతలు తెలుపుతున్నామని గతంలో ఎన్నడూ లేని విధంగా 6 లక్షల మందితో భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని గోదావరి జిల్లాలోని జనసేన అభిమానులు విశేషంగా తరలి రావాలని పిలుపు నిచ్చారు. అయితే ఈ మీడియా సమావేశంలో టీడీపీ నేతలు పాల్గొనకపోవడం గమనార్హం..
