సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పట్టణంలోని మెంటే వారి తోటలోని సుందరయ్య భవనం లో ఈనెల 25వ తేదీ వచ్చే ఆదివారం .. పక్షవాతం, పిట్స్, బిపి, షుగర్ వ్యాధిగ్రస్తులకు వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు వసుధ ఫౌండేషన్ కన్వీనర్ ఇందుకూరి ప్రసాదరాజు తెలిపారు. అల్లూరి సీతారామరాజు భగత్ సింగ్ వైద్య సహాయ కేంద్రంలో విజయవాడ కు చెందిన డాక్టర్ గోపాళం శివన్నారాయణ, మెడికల్ క్యాంపు లో వైద్యులు డాక్టర్ యస్.పూర్ణచంద్, జి.సత్యనారయణరాజు తదితరులు పాల్గొని వైద్య సేవలు అందిస్తారన్నారు.తక్కువ ధరలకే అవసరమైన ఔషధాలను నెలలవారీగా అందిస్తారన్నారు. శిబిరం నకు వచ్చేవారు ఒక రోజు ముందే షుగర్ పరీక్ష, రక్తపోటులు చూపించుకుని రిపోర్ట్స్ తో రావాలన్నారు..చేయించుకోలేనివారికి బిపి, షుగర్ పరీక్షలు వైద్య శిబిరం లో ఉచితంగా చేస్తారన్నారు .ఈ అవకాశం ను పట్టణ ప్రజలు రోగులు సద్వినియోగం వినియోగించుకోవాలన్నారు..
