సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు, శుక్రవారం సీఎం జగన్ ఒంగోలులో జరిగిన బహిరంగ సభలో 21వేల మంది మహిళలకు ఇళ్ల పట్టాలను పం పిణీ చేశారు.దాని విలువ రూ.231 కోట్ల రూపాయలు అన్నారు. అలాగే, ఒంగోలులో నూతన మంచి నీటి పథకం కూడా ప్రారంభించారు. సీఎం జగన్ మాట్లాడుతూ.. రాష్ట్రం లో ఒక్క పేదవాడికీ చంద్రబాబు సెంటు స్థలం ఇవ్వలేదని కానీ, మనం మంచి చేస్తుంటే కోర్టులకు వెళ్లి రాక్షసుల్లా అడ్డుకున్నారు. పేదలకు మంచి జరగకుండా కోర్టులో 1191 కేసులు వేశారు. చం ద్రబాబు కుట్రలను అధిగమించి పేదలకు ఇళ్ల పట్టాలు ఇస్తున్నాం. రిజిస్ట్రేషన్ చేసి పట్టాలు ఇవ్వ డం వల్ల అక్క చెల్లెమ్మ లకు ఆస్తి మీద పూర్తి హక్కు ఉంటుంది. భవిష్య త్లో రిజిస్ట్రేషన్లను క్యాన్సిల్ చేసే అవకాశం ఎవరికీ ఉండదు. బ్యాంకు రుణాలు వస్తాయి. మేము అదే చేస్తున్నాము.. వంద మంది సినిమా విలన్ల దుర్మార్గం కంటే చంద్రబాబు దుర్మార్గమే ఎక్కువ. ఇన్ని కుట్రలు చేసి కూడా చంద్రబాబు ఇంకా బరితెగించి రాజకీయాల్లోఉన్నారు. అన్ని వర్గాల ప్రజలను చంద్రబాబు మోసం చేశారు.చంద్రబాబు దారుణాలు ఎల్లోమీడియాకు కనిపించవు. మనం సిద్ధం అంటుంటే చంద్రబాబు సతీమణి సిద్ధంగా లేమంటున్నారు.టీడీపీ ఓటమి ఆమెకు తెలిసిపోయింది. కుప్పం నుంచే బై బై బాబు అంటున్నారు. చంద్రబాబు మాదిరి నాకు నాన్ రెసిడెన్స్ ఆంధ్రాస్ మద్దతు లేదు. మీ ఇంట్లో మంచి జరిగితే మీ బిడ్డకు తోడుగా ఉండండి అన్నారు సీఎం జగన్
