సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నరసాపురం లోక్ సభ స్థానం నుండి టీడీపీ , జనసేన కూటమి మద్దతు తో బీజేపీ అభ్యర్థిగా బరిలో దింగేందుకు ప్రస్తుత ఎంపీ రఘురామా కృష్ణంరాజు కు లైన్ క్లియర్ అయినట్లు సమాచారం.. ఆయన ఇప్పటికే వైసిపి కి రాజీనామా చేసి బీజేపీలో చేరటానికి సిద్ధంగా ఉన్నారు. ఏపీలో బీజేపీకి 5 లోక్ సభ స్థానాలు 9 అసెంబ్లీ స్థానాలు ఇవ్వడానికి టీడీపీ జనసేన కూటమిల మధ్య పొత్తు కుదిరిందని?… అందులో భాగంగా నరసాపురం లోక్ సభ స్థానం నుండి బీజేపీ అభ్యర్థిగా రఘురామా కృష్ణంరాజు ను కేంద్ర అధిష్టానం అంగీకరించినట్లు తెలుస్తుంది. ఇటీవల కాలంలో భీమవరం చెందిన పలువురు కీలక నేతలకు బీజేపీ ఎంపీ టికెట్ ఖరారు చేస్తున్నారని వార్తలు హల్ చల్ చేసినప్పటికీ (మన సిగ్మా న్యూస్ లో కాదు) చివరకు రఘురామా..కు ఆ అవకాశం వరించినట్లు తెలుస్తుంది. ఈ విషయాన్ని తన స్వంత ప్రాంతం భీమవరం లోనే ఎంపీ రఘురామా కృష్ణంరాజు తన కార్యాలయంలో ప్రకటించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఎంపీ రఘురామా.. రేపు బుధవారం ఉదయం 9:30 గంటలకు హైదరాబాదు నుండి రాజమండ్రి ఎయిర్ పోర్ట్ కి చేరుకుంటారు, అక్కడి నుంచి నేరుగా రోడ్డు మార్గాన తాడేపల్లిగూడెం చేరుకుంటారు, అక్కడ టీడీపీ జనసేన క్యాడర్ తో సమావేశం అవుతారు. తాడేపల్లిగూడెంలో మధ్యాహ్నం 3 గంటలకు తెలుగుదేశం జనసేన ఉమ్మడి భారీ బహిరంగ సభకు హాజరవుతారు, బహిరంగ సభ మీటింగ్ అనంతరం రోడ్డు మార్గాన భీమవరం పెద్దఅమిరం లో ఉన్న ఆయన నివాసానికి చేరుకుంటారు.
