సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: మాజీ మంత్రి గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని నేడు, ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ జన సైనికులు, పవన్ కళ్యాణ్ అభిమానులకు ఒక విజ్ఞప్తి చేశారు. ఎన్నికలలో గెలవడం కోసం చంద్రబాబు దేనికైనా సిద్దపడే వ్యక్తి. అభిమానులు అప్రమత్తంగా లేకపోతే పవన్ కల్యాణ్ మూల్యం చెల్లించుకుంటారని.. ఆయనను కాపాడాల్సిన బాధ్యత వారిపైనే ఉందన్నట్టుగా తెలిపారు. చంద్రబాబు కు మీ ఓట్లు కావాలి కానీ సీట్లు ఇవ్వరన్నారు .రాష్ట్రంలో ఏ నియోజకవర్గాన్ని వైసిపి టార్గెట్‌గా పెట్టుకోలేదని 175 స్థానాల్లో గెలవడమే మా లక్ష్యమన్నారు. కచ్చితంగా చెబుతున్న.. పవన్ కళ్యాణ్‌ను భీమవరం పోటీచేసిన లేక పిఠాపురం ..ఎక్కడ పోటీ చేసిన ఓడించేది టీడీపీ యేనని కోడలి నాని అన్నారు. వెన్నుపోటుకి బ్రాండ్ అంబాసిడర్‌లైన చంద్రబాబును, నాదెండ్లను పవన్ కల్యాణ్ పక్కన పెట్టుకుని తిరుగుతున్నాడన్నారు. అధికారంలో ఉన్న ఎన్టీఆర్‌ నే కూల్చి పడేసిన చంద్రబాబు, నాదెండ్లకు పవన్ ఒక లెక్కా? అని కొడాలి నాని ప్రశ్నించారు. 3 శాతం ఓటింగ్ ఉన్న నా కమ్మ సామాజిక వర్గానికి 30 సీట్లు ఇచ్చి.. 20శాతం పైగా ఉన్నకాపు వర్గానికి 24 సీట్లా? అని ప్రశ్నించారు. జనసేనకి ఇచ్చిన సీట్లలో పది కచ్చితంగా ఓడిపోయే సీట్లు ఉన్నాయన్నారు. ఇవ్వడానికి చంద్రబాబుకి.. తీసుకోవడానికి పవన్ కు సిగ్గుండాలన్నారు. కానీ రాజ్యాధికారం కోసం ఎదురుచూస్తున్న పవన్ సామాజిక వర్గం ఓట్లు టీడీపీ కి ట్రాన్స్‌ఫర్ అవ్వవని కొడాలి నాని వ్యాఖ్యానించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *