సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పట్టణంలో గత దశాబ్దం పైగా అభివృద్ధి కి నోచుకోక తీవ్ర గుంతలతో ప్రయాణికులను, విద్యార్థులను వాహనదారులను పలు ప్రమాదాలకు లోను చేసిన బలుసుమూడి రోడ్డు కు ఇటీవల మోక్షం లభించింది. ( ఈ రోడ్డు ప్రమాద భరితంగా ఉందని మన సిగ్మా న్యూస్ లో గతంలో పలు మారులు న్యూస్ ఐటమ్స్ వెయ్యడం కూడా జరిగింది. ) ఎట్టకేలకు 1 కోటి 71 లక్ష 50 వేల రూపాయల ప్రభుత్వ నిధులతో బలుసుముడి గౌడ్ సంఘం రామాలయం నుండి తెలుగుదేశం జిల్లా అధ్యక్షురాలు ఇంటి మీదుగా ఆదిత్య కాలేజీ వరకు నిర్మాణం చేసిన నూతన సీసీ రోడ్డును నేడు, సోమవారం స్థానిక ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ వందలాది స్థానికుల హర్షం మధ్య రోడ్డు ప్రారంభించారు. ఆ రోడ్డు ఫై వెళుతున్న బస్సులలో విద్యార్థులు కూడా కిటికీల నుండి ఎమ్మెల్యే గ్రంధి కి షేక్ హ్యాండ్స్ ఇస్తూ కృతఙ్ఞతలు తెలిపారు.నూతన రోడ్డు ప్రారంభోత్సవం తరువాత ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ మాట్లాడుతూ.. గత 4న్నర ఏళ్ళు పైగా తన హయాంలో భీమవరం ని జిల్లా కేంద్రంగా మార్చేందుకు కృషి చెయ్యడమే కాకుండా గతంలో కనివిని ఎరుగని అభివృద్ధి ని సీఎం జగన్ సహకారంతో చేస్తున్నానని, ఈ బలుసుమూడి రోడ్డు లోనే నివాసం ఉంటున్న టీడీపీ జిల్లా అడ్జక్షురాలు తోట సీతారామ లక్ష్మి రాజ్య సభ సభ్యురాలిగా పనిచేసిన ఆవిడ.. గత ప్రభుత్వ హయాంలో కానీ తనకు కేటాయించిన ఎంపీ నిధులు కేటాయించి కూడా ఈ రోడ్డు అభివృద్ధి చేయలేకపోయారని, అయినప్పటికీ ప్రజా సంక్షేమం కోసం పార్టీలు చూడని మా జగన్ ప్రభుత్వ హయాంలో దీనిని పూర్తీ చెయ్యడం గర్వముగా ఉందని, వాస్తవాలను స్థానిక టీడీపీ వారు కూడా గుర్తించాలని ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ అన్నారు.
·
