సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇటీవల కాలంలో కాస్త ధరలు దిగి వస్తున్నా ఉల్లి మరియు అల్లం ధరలు ఊహించని విధంగా గత 4 రోజులుగా పెరుగుతూ వెళుతున్నాయి. గత వారం రోజుల క్రితం వరకు కేజీ 20 రూపాయల నుండి 25 రూపాయలకు రిటైల్ మార్కెట్ లో దొరికిన ఉల్లి పాయల ధర అమాంతంగా పెరిగిపోయింది. గత 2 వరాల క్రితం వరకు 7 కిలోల కొత్త ఉల్లి ఆటోలలో 100 రూపాయలకు అమ్మిన రోజులు జరిగాయి. అయితే మహారాష్ట్ర నుండి దిగుమతులు తగ్గడంతో ఇప్పుడు ఒక్కసారిగా కేజీ 40 రూపాయలకు చేరిపోయింది. అలాగే అల్లం ధర బాగా రిటైల్ మార్కెట్లో పెరిగింది. వారం రోజుల క్రితం అల్లం కేజీ ధర రూ.120 నుంచి రూ.130 వరకు ఉండగా, ఇప్పుడు ఈ ధర మరో రూ.30 నుంచి రూ.50కి పెరిగింది. అల్లం కేజీ ధర రూ.170 వరకు పలుకుతోంది. ఇటీవల చలి గాలులకు ఆరోగ్యం కోసం అల్లం వినియోగం పెరగడం, ఎండాకాలం శుభకార్యక్రమాలు ఎక్కువ కావడంతో దానికి తోడు రాయలసీమ జిల్లాల నుంచి అల్లం దిగుమతులు తగ్గడంతో ధరలు పెరుగుతున్నాయి. దీనికి తోడు పచ్చళ్ళ సీజన్ కూడా ఆరంభం కావడంతో హోల్‌ సేల్‌ డీలర్లు కృత్రిమ కొరతను సృష్టిస్తున్నట్టు ప్రజలు భావిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *