సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: రైలు ప్రయాణికులకు మరింత మెరుగైన సేవలందించేందుకు అధునాతనమైన లింకె హాఫ్‌మన్‌ బచ్చ్‌ బోగీలను కాకినాడ-లింగంపల్లి-కాకినాడల మధ్య రాక పోకలు సాగించే గౌతమి ఎక్స్‌ప్రెస్‌ రైలును ఏర్పాటుచేశారు. ఈ రైలు గత ఆదివారం నుంచి ప్రారంభించారు. కాకినాడ, సామర్లకోట, తాడేపల్లి గూడెం, ఏలూరుల మీదుగా రైల్వేస్టేషన్లకు మీదుగా వెళ్లే గౌతమీ ఎక్స్ ప్రెస్ రైళ్లు కు అధునతన ఎల్‌హెచ్‌బీ బోగీలను ఏర్పాటు చేసారు. ఇటీవల పాత ఎక్స్‌ప్రెస్‌ రైళ్లకు కూడా ఏర్పాటు ,మార్పులు చేస్తున్న నేపథ్యంలో కాకినాడ-లింగంపల్లి ( హైదరాబాద్)- కాకినాడల మధ్య రాకపోకలు సాగిస్తున్న గౌతమి ఎక్స్‌ప్రెస్‌ రైలుకు కూడా ఎల్‌హెచ్‌బీ బోగీలను అనుసంధానం చేశారు. ఈ అధునాతన బోగీలను జర్మనీ కొలాబ్రేషన్‌తో కపూర్తలాలో తయారుచేస్తున్నారు. ఈఅధునాతన ఎల్‌హెచ్‌బీ బోగీ లతో ప్రయాణం ఎటువంటి కుదుపులు, సౌండ్స్‌ లేకుండా సాఫీగా సాగుతుంది. ఇకపై గౌతమీ ఎక్స్‌ప్రెస్‌ రైలు లో మొత్తం 24 బోగీలలో 22 బోగీలు ఎల్‌హెచ్‌బీ బోగీలే కావడం విశేషం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *