సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పశ్చిమ గోదావరి జిల్లాలో పల్స్ పోలియో కార్యక్రమంలో భాగంగా మొత్తం ఉన్న 5 ఏళ్ళ లోపు 1,85,953 మంది చిన్నారులకు 1,81,565 మందికి పోలియో చుక్కలు వేసి 97.64 శాతం లక్ష్యం సాధించామని డీఎం హెచ్ఓ తెలిపారు. 5,520 మంది వ్యాక్సినేటర్ల ద్వారా పిల్లలకు పోలియో చుక్కలు వేశామన్నారు. ఇంకా పోలియో చుక్క లు వేసుకోని పిల్లల కోసం నేడు సోమవారం , రేపు ఇంటింటికీ వైద్య సిబ్బంది వెళతారన్నారు. ఇదిలా ఉండగా భీమవరంలో పల్స్ పోలియో కార్యక్రమంలో భాగంగా వరల్డ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్, AP చైర్మన్, పర్రిపాటి శ్రీనివాస్ తమ సేవలు అందిస్తున్నట్లు తెలిపారు. 19వ వార్డు వీరమ్మ పార్క్ సెంటర్ సచివాలయంలో పాటు పలు చోట్ల నిర్వహణ పర్యవేక్షించినట్లు తెలిపారు నేడు, రేపు మంగళవారం కూడా ఇంకా చుక్కలు మందు వేయించుకొని కొద్దీ మంది పిల్లల వివరాలు తెలుసుకొని వారికీ కూడా వేయిస్తామన్నారు.
