సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: విశాఖ ప‌ర్య‌ట‌న‌లో భాగంగా సీఎం జగన్ నేడు, మంగళవారం జీవీఎంసీ వీఎంఆర్డీఏకి చెందిన దాదాపు రూ. 1500 కోట్ల అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు చేశారు. అనంత‌రం రాడిసన్ బ్లూ హోటల్ లో నిర్వ‌హించి ఏపీ డెవలప్‌మెంట్‌ సదస్సులో పాల్గొన్నారు. ఈ స‌ద‌స్సుకు రెండు వేల మందికి పైగా పారిశ్రామికవేత్తలు హ‌జ‌ర‌య్యారు.. ఈ సంద‌ర్బంగా సిఎం జగన్ మాట్లాడుతూ,.. రాష్ట్ర విభజన తర్వాత మన ఆంధ్రుల కష్టం పెట్టుబడులు పెట్టిన రాజధాని హైదరాబాద్ ను కోల్పోయామని దాని ప్రభావం ఏపీపై ఎంతో ఉందని అన్నారు. అయితే తాము తీసుకుంటున్న చ‌ర్య‌ల వల్ల హైదరాబాద్‌ కంటే మిన్నగా వైజాగ్‌లో అభివృద్ధి జరుగుతోందని, ప్రపంచ ప్రఖ్యాత సాప్ట్ వేర్ సంస్థలు ఇక్కడ కార్యాలయాలు ప్రారంభించాయని సీఎం తెలిపారు. ఉత్పత్తి రంగంలో దేశంలో ఏపీ మెరుగ్గా ఉందని.. అభివృద్దిలో​ విశాఖ నగరం దూసుకెళ్తోందని తెలిపారు. రాయపట్నం, కాకినాడ, మూలపేట, మచిలీపట్నం పోర్టులు ఎంతో కీలకమని అన్నారు.వచ్చే ఎన్నికల అనంతరం వైజాగ్‌ నుంచే పాలన సాగిస్తానని జగన్ స్పష్టం చేశారు. మళ్లీ గెలిచి వచ్చాక వైజాగ్‌లోనే ప్రమాణ స్వీకారం చేస్తానని అన్నారు. విశాఖ అభివృద్ధికి అన్ని విధాలుగా కట్టుబడి ఉంటానన్నారు. ఏపీలో తలసరి ఆదాయం పెరిగిందంటూ . దేశంలోనే వ్యవసాయం రంగంలో ఏపీలో 70 శాతం అదనపు వృద్ధి సాధించామని అన్నారు. లక్షలాది ఉద్యోగ కల్పన వల్ల ఏపీలో నిరుద్యోగం తగ్గింది ఉపాధి అవకాశాల పెరిగాయని జగన్ చెప్పారు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *