సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు, మంగళవారం మంగళగిరి లో టీడీపీ-జనసేన పార్టీల ఉమ్మడి బహిరంగ సభలో వారు ఉమ్మడిగా రూపొందించిన బీసీ డిక్లరేషన్ ను చంద్రబాబు ఇవాళ పవన్ కళ్యాణ్ తో కలిసి మంగళగిరి జయహో బీసీ సభలో విడుదల చేశారు. ఇందులో ఇరు పార్టీలు అధికారంలోకి వస్తే బీసీలకు అమలు చేస్తామని ప్రకటించారు. బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. తాము అధికారంలోకి వస్తే ఈ బీసీ డిక్లరేషన్ ను అమలు చేసి తీరతామన్నారు. ఇక చంద్రబాబు మాట్లాడుతూ.. బిసి లు ఎప్పుడు టీడీపీ కి అండగా ఉంటారని అందుకే ..బీసీల రుణం తీర్చుకునేందుకే పది సూత్రాలతో బీసీ డిక్లరేషన్ తెచ్చామన్నారు. అందరికి 60 ఏళ్లకు వృద్ధాప్య పించను లు ఇస్తుంటే బిసి కులాలలో వారికీ ఇకపై 50 ఏళ్లకే పింఛను క్రింద నెల నెల 4వేల రూపాయలు అందజేస్తామని సంచలన ప్రకటన చేసారు. బీసీ సబ్‌ప్లాన్ ద్వారా ఐదేళ్లలో రూ.లక్షా 50 వేల కోట్లు కేటాయిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. వైసీపీ పాలనలో సబ్‌ప్లాన్ నిధులను పక్కదారి పట్టించారని చంద్రబాబు విమర్శించారు. ఇంకా బీసీలకు ఇతర కమ్యూనిటీలు దాడుల నుంచి రక్షణ కల్పించేలా చట్టం వంటి పలు హామీలు ఉన్నాయి.ప్రతిఏడాది కుల ధ్రవీకరణ తీసుకునే వ్యవస్థ రద్దు చేస్తామన్నారు. శాశ్వత కుల ధ్రువీకరణ పత్రాలు ఇస్తామన్నారు. చంద్రన్న బీమా కింద బీసీలకు రూ.10 లక్షలు ఇస్తామని, బీసీల్లో ఉన్న 157 కులాలకు న్యాయం చేసే బాధ్యత తీసుకుంటామని చంద్రబాబు తెలిపారు బీసీ డిక్లరేషన్ ను ఇంటింటికీ తీసుకెళ్తామని చంద్రబాబు తెలిపారు.
