సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు మండలం మద్దూరులో గత మంగళవారం జరిగిన ఘటనపై పోలీసుల చెప్పిన తాజా వివరాల ప్రకారం.. మద్దూరుకు చెందిన సండ్ర వీరబాబుకు, అత్తిలి గ్రామానికి చెందిన లావణ్య సాయిదీపికతో 2010లో వివాహం జరిగింది. వీరికి కుమారుడు జయశంకర్‌, కుమార్తె కుందన ఉన్నారు. వీరబాబు తాపీ పనిచేస్తుంటాడు. మద్యం, పేకాటలకు బానిస కావడంతో భార్యాభర్తల మద్య తరచూ డబ్బు ఖర్చుల విషయమై గొడవలు జరుగుతున్నా నేపథ్యంలో గత మంగళవారం డ్వాక్రా రుణానికి సంబంధించిన వాయిదా డబ్బు చెల్లింపు విషయంలో వారి మధ్య మాటలు పెరిగి భర్త వీరబాబు పట్టరాని కోపంతో భార్య చెంపపై గట్టిగా కొట్టాడు. దీంతో ఇక మాటలేకుండా లావణ్య కిందపడి మరణించింది అని తెలుస్తుంది. దానితో కంగారు పడిన వీరబాబు అత్తిలిలో ఉన్న అత్తమామలకు ఫోనులో తెలియజేయగా వారు హుటాహుటిన మద్దూరు రావడంతో లావణ్య చనిపోయిన విషయం వెలుగులోకి వచ్చింది. కొవ్వూరు డీఎస్పీ కె.రామారావు, సీఐ పి.శ్రీనివాసరావు, రూరల్‌ ఎస్‌ఐ కె.సుధాకర్‌ సంఘటనా స్థలానికి చేరుకుని కేసు దర్యాప్తు ప్రారంభించారు. అన్యాయంగా తమ కుమార్తెను చంపేశారని ఆరోపించారు. లావణ్య తండ్రి ఫిర్యాదు మేరకు భర్త వీరబాబు అతని తల్లిపై కేసు నమోదు చేసారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *