సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరంలో ఆరోగ్య శ్రేయో అభిలాషల కొరకు రేపు ఆదివారం ( తేదీ 10-3-24 న ) ఉదయం 9 గంటల నుండి 1.00 వరకు స్థానిక 20వ వార్డు, మోటుపల్లివారి వీధిలో ఉన్న ఇండియన్ మెడికల్ అసోసియేషన్ హాల్ ( శ్రీ మావుళమ్మ పూరి గుడి వద్ద) మోటుపల్లి వారి వీధి నందు.. స్థానిక నూట్రి .. ఫుడ్ ఫార్మసీ వారు ప్రజలకు ఉచితంగా ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. షుగర్, బిపి సమస్యలు, థైరాయిడ్, గుండె, కిడ్నీ సమస్యలు, జీర్ణ క్రియ, మోకాళ్ళ నొప్పులు – కీళ్ల నొప్పులు – ఆర్థరైటిస్ వంటి ఎన్నో సమస్యలతో అనారోగ్య లక్షణాలతో బాధపడే వారికీ ఉచిత పరీక్షలు నిర్వహించబడును. తదుపరి డాక్టర్ పైడి కొండల కిషోర్ కుమార్ తో ఆరోగ్య అవగాహన సదస్సు నిర్వహించబడును కావున స్థానిక ప్రజలు రోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగ పరుచుకోవాలని కోరుతున్నారు.
