సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఎట్టకేలకు ఢిల్లీలో బీజేపీ పెద్దలతో సీట్ల పంపిణి ఫై రాజీ కుదరడంతో తెలుగుదేశం పార్టీతో పొత్తుపై బీజేపీ కీలక ప్రకటన చేసింది. మూడ్రోజుల పాటు ఢిల్లీ లోనే ఉండి బీజేపీ అగ్రనేతలతో టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ సుదీర్ఘ చర్చలు జరిపిన సంగతి తెలిసిందే. చర్చల అనంతరం పొత్తుపై బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా ఓ లేఖ రూపంలో అధికారిక ప్రకటన చేశారు. ఎన్డీఏలో చేరాలని చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లు తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని తెలిపారు.ప్రధాని మోదీ నేతృత్వంలో బీజేపీ-టీడీపీ- జనసేన దేశాభివృద్ధికి కట్టుబడి ఉంటుందన్నారు. ఏపీ అభివృద్ధికి ఎన్డీఏ కృషి చేస్తుందన్నారు. టీడీపీ కీలక నేతలకు చంద్రబాబు ఫోన్ చేసి బీజేపీ తో కొన్ని సర్దుబాటులకు త్యాగాలు చెయ్యవలసి ఉందని సహకరించాలని అలాగే ఈనెల 17వ తేదీన టీడీపీ జనసేన తో పాటు ప్రధాని మోడీ కూడా బహిరంగ సభలో పాల్గొనే అవకాశం ఉందని దానికి తగిన భారీ జనసమీకరణతో ఏర్పాట్లు చెయ్యాలని సూచించారు.
