సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఈ ఏడాది కూడా భీమవరం శ్రీ విష్ణు ఇంజినీరింగ్ కాలేజీ ఫర్ విమెన్ లో నిన్న , నేడు మంగళవారం 2 రోజులు పాటు “టెక్నోవా 2K24” – జాతీయ స్థాయి మహిళా సాంకేతిక సదస్సు ను విజయవంతంగా నిర్వహించినట్లు కన్వీనర్ డాక్టర్ ఎ. శ్రీకృష్ణ తెలిపారు. ఈనెల 11 మరియు 12 తేదీలలో విష్ణు క్యాంపస్ నందు నిర్వహించిన ఈ సదస్సులో 46 ఇంజిజీరింగ్ కళాశాలలకు చెందిన సుమారు 400 మంది విద్యార్థులు పాల్గొనడం జరిగిందని, ఈ సదస్సులో భాగంగా హ్యాకతాన్, మేకతాన్, ప్రాజెక్ట్ ప్రదర్శనలు, కోడింగ్ కాంటెస్ట్ పోటీలు, క్విజ్ ప్రోగ్రామ్స్, బిజినెస్ ఈవెంట్స్, టెక్నీకల్ ట్రజర్ హంట్, జియో వాల్ కాంపిటీషన్, యంగ్ మేనేజర్, త్రీడి మోడలింగ్, సర్క్యూట్ క్రాఫ్ట్ ఈవెంట్, స్పాట్ ఈవెంట్స్, లాంటి వివిధ పోటీలను నిర్వహించారు. విశిష్ట అతిధిగా వచ్చిన మైక్రోసాఫ్ట్ బెంగుళూరు శాఖలో డిజైనర్ పవన్ కుసుమార్ వివిద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ.. విద్యార్థులు తమ స్వంత ఆలోచనలతో ఉన్నత జీవితానికి నిచ్చెనలు వేయాలని,దేశంలోని కార్పొరేట్ రంగం ఉద్యోగస్తుల నుండి ఎటువంటి నైపుణ్యాలను ఆశిస్తుందో ఆ విధంగా నైపుణ్యాలను, ఆలోచనాతీరుని కలిగి ఉండాలన్నారు. ఈరోజు 12.03.2024 తేదీన సదస్సు ముగింపు కార్యక్రమం విష్ణు క్యాంపస్ లోని శ్రీమతి బి. సీతా ఇండోర్ ఆడిటోరియం లో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ పి. శ్రీనివాస రాజు విజేతలకు బహుమతులు, సర్టిఫికెట్స్ ను అందజేయడం జరిగింది. వాటికీ అదనంగా సుమారు ఒక లక్షా పదివేల రూపాయల నగదు ప్రోత్సాహక బహుమతులను కూడా విజేతలకు అందజేయడం జరిగింది. 14 మంది సీనియర్ అధ్యాపక మరియు అధ్యాపకేతర సిబ్బందిని కళాశాల యాజమాన్యం తరఫున సత్కరించి, బహుమతులను అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో వివిధ విభాగాధిపతులు, డీన్స్, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
