సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఏపీ అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కావడానికి బహుశా కొద్దీ గంటలే సమయం ఉందని అందరు భావిస్తున్న నేపథ్యంలో.. నేడు, గురువారం తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు రెండో జాబితా అభ్యర్థులను ప్రకటించారు. 34 మంది అభ్యర్థులతో ప్రకటించిన ఈ జాబితాలో మొత్తం 11 మంది పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. 9 మంది గ్రాడ్యుయేషన్ చేసినవారు ఉన్నారు. ఒకరు పీహెచ్‌డీ చేసిన అభ్యర్థి ఉన్నారు. మొత్తం అభ్యర్థుల్లో 27 మంది పరుషులు, ఏడుగురు స్త్రీలు ఉన్నారు.ఇక ఈ లిస్టులో గోదావరి జిల్లాలకు సంబంధించి అభ్యర్థుల వివరాలు.. దెందులూరు-చింతమనేని ప్రభాకర్ , గోపాలపురం-మద్దిపాటి వెంకటరాజు, కొవ్వూరు -ముప్పిడి వెంకటేశ్వరరావు రంప చోడవరం – మిర్యాల శిరీష, ప్రతిపాడు-వరుపుల సత్యప్రభ, రాజమండ్రి రూరల్-గోరెంట్ల బుచ్చయ్య చౌదరి లను అభ్యర్థులుగా ప్రకటించారు. మొదటి లిస్టులో 99 మంది టీడీపీ అభ్యర్థులను ప్రకటించడం గమనార్హం..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *