సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భారత వాత‌వ‌ర‌ణ శాఖ చ‌ల్ల‌టి శుభ‌వార్త వినిపించింది.. ఏపీ, తెలంగాణ‌ల‌లో నేటి నుంచి వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. గత కొద్దిరోజులుగా తెలుగు రాష్ట్రాల్లో భానుడు భగభగమండిపోతున్నాడు. నేటి శనివారం నుండి అంటే ఈనెల 16 నుంచి 21 వరకు పలుచోట్ల ఒక మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రకటించింది. ఉదయం8గంటల వరకు చలిగాలులు తిరుగుతున్నా ఇక 10 గంటల నుంచే సూరీడు మండిపోతున్నాడు. దీంతో ఎండ వేడిమికి ప్రజలు అల్లాడిపోతున్నారు. బయటకు రావాలంటేనే హడలెత్తిపోతున్నారు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో 40 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతోంది. ఇక పిల్లలకు వడదెబ్బ తగలకుండా స్కూల్ పిల్లలకు ఒంటిపూట బడులు నిర్వహిస్తున్నారు.ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, పశ్చిమబెంగాల్, జార్ఖండ్, ఒడిషా, చండీగఢ్, మధ్యప్రదేశ్, సిక్కిం, అరుణాచల్‌ప్రదేశ్, అస్సాం, మేఘాలయ, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపురలో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *