సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: రాజకీయాలలో శాశ్వత శత్రువులు మిత్రులు ఉండరు.. అన్నది మరోసారి నిరూపిస్తూ .. గతంలో ప్రత్యేక హోదాపై మాట తప్పారని, పాచిపోయిన లడ్డులు ఇచ్చారని, రాజధానికి చెంబుడు నీళ్లు ఇచ్చారని, సంసారం లేనివాడికి ప్రజలు కష్టాలు ఎలా తెలుస్తాయని, పోలవరం అవినీతి కి ఏటీఎం అని, అసమర్ధ పాలన అంటూ ఒకరికి ఒకరు విమర్శించుకొంటూ కాలం గడిపిన మూడు పార్టీల అగ్రనేతలు తాజగా ‘ఏపీ ప్రజల రక్షణ’ కోసం స్లోగన్ తో మరోసారి ఏకం అవుతూ ఒకే వేదికపై రేపు శనివారం దర్శనమివ్వనున్నారు. చిలకలూరిపేటలో నిర్వహించే ఈ సభను టీడీపీ అధిష్టానం ప్రతిష్టాతక్మంగా తీసుకుంది. మూడు పార్టీలు కూటమిగా ఏర్పడ్డాక నిర్వహిస్తున్న ఈ తొలి సభకు ప్రధాని మోదీ హాజరవుతున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొనే ఈ సభలో ఉమ్మడి కార్యచరణ, ఎన్నికల మేనిఫెస్టోను ప్రకటించే అవకాశం ఉంది. 3 పార్టీలు కలిసి సభను నిర్వహిస్తుండటంతో మూడు పార్టీల నేతలు భారీగా హాజరుకానున్నారు. గతంలో వైసీపీ ఏర్పాటు చేసిన సిద్ధం సభలకు మించి దాదాపు 14 లక్షల పైగా జనసమీకరణ లక్ష్యంగా టీడీపీ నేతలు ఇందుకోసం 100 ఎకరాల విస్తీర్ణంలో సభ ప్రాంగణాన్ని నిర్వహిస్తున్నారు. దూరం ప్రాంతాల నుంచి సభకు హాజరయ్యే ముఖ్య నేతలకు, కార్యకర్తలకు.. ముఖ్యంగా మహిళలకు ప్రత్యేక ఏర్పాటు చేశారు.ప్రధాని మోడీ రేపు సాయంత్రం 4 గంటలకు విజయవాడకు వచ్చి.. అక్కడినుంచి గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి హెలికాప్టర్ ద్వారా బొప్పూడి చేరుకుంటారు. సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటల వరకూ సభలో పాల్గొని.. తిరిగి.. గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి హైదరాబాద్ చేరుకోనున్నారు
