సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు, శనివారం సీఎం జగన్ మోహన్ రెడ్డి వచ్చే ఎన్నికలలో ఏపీలోని 175 నియోజకవర్గాలలో మరియు 25 లోక్ సభ నియోజకవర్గాలలో (అనకాపల్లి తప్ప) ఎంపీ అభ్యర్థులను అధికారికంగా ప్రకటించారు. దీనిలో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లాలో నరసాపురం ఎంపీ అభ్యర్థిగా భీమవరం కు చెందిన గూడూరి ఉమాబాల ను ఖాయం చేసారు. ఇక 7 నియోజక వర్గాలలో వైసీపీ అభ్యర్థుల వివరాలు : భీమవరం గ్రంధి శ్రీనివాస్ ( కాపు ఓ సి ),తాడేపల్లి గూడెం కొట్టు సత్యనారాయణ ( కాపు ఓసీ ), తణుకు కారుమూరి నాగేశ్వర రావు ( యాదవ బిసి), పాలకొల్లు లో కొత్త అభ్యర్థి గుడాల శ్రీహరి గోపాలరావు( శెట్టి బలిజ బిసి), ఆచంట రంగనాధ రాజు (క్షత్రియ ఓసి), ఉండి పివిఎల్ నరసింహరాజు ( క్షత్రియ ఓసి) నరసాపురం ప్రసాదరాజు (క్షత్రియ ఓసి) ను అభ్యర్థులుగా బరిలో దింపుతున్నట్లు ప్రకటించారు. దీనితో అభ్యర్థుల సస్పెన్సు కు తెరదిగింది. ఇంకా ఎన్నికల నామినేషన్స్ సమయంలో ఏమైనా తప్పనిసరి పరిస్థితులలో మార్పులు జరగవచ్చు తప్ప దాదాపు ఇదే ఖాయం..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *