సిగ్మాతెలుగు డాట్, కామ్ న్యూస్: నేడు, శనివారం మధ్యాహ్నం కేంద్ర ఎన్నికల సంఘం సార్వత్రిక ఎన్నికల ను, 7 దశలలో లోక్ సభ ఎన్నికలను నిర్వహిస్తామని షెడ్యూలు ప్రకటించి దేశవ్యాప్తంగా ఎన్నికల కోడ్ ను అమలు లోకి తెచ్చింది. ముఖ్యముగా ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు కూడా మే 13న నిర్వహించి దేశంలో అన్ని ప్రాంతాలలో ఒకేసారి ఎన్నికల కౌంటింగ్ ను జూన్ 4వ తేదీన నిర్వహించి ఫలితాలు వెలువడతాయి. అభ్యర్థులు నామినేషన్స్ ఏప్రిల్ 25వ తేదీలోగా సమర్పించి ఉపసంహరణ ఏప్రిల్ 29లోగ చెయ్యాలి. ఇక ఎన్నికల కోడ్ అమలులోకి తక్షణం వస్తుంది. జూన్ 4వరకు కొనసాగుతుంది. ఈ షెడ్యూల్ వెలువడిన 24 గంటల్లోగా ప్రభుత్వ, బహిరంగ ప్రదేశాలలో ఆస్తులపై గల అన్ని రకాల వాల్ రైటింగులు, పోస్టర్లు, కటౌట్లు, హోర్డింగులు, బ్యానర్లు, జెండాలు వంటివన్నీ తొలగించాలి.ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రసార మాధ్యమాల్లో ప్రభుత్వ నిధులతో జారీ చేసే అన్ని రకాల అడ్వర్టైజ్మెంట్లను నిలిపి వేయాలి..మంత్రులెవరూ అధికారిక వాహనాలను ,ప్రభుత్వ అతిధి గృహాలను ఎన్నికల ప్రచారంలో వాడకూడదు.. ప్రభుత్వ భవనాలు, కార్యాలయాల్లో ప్రధాన మంత్రి, ముఖ్యమంత్రి సహా మంత్రుల ఫొటోలు ఉండరాదు ..ఎన్నికల విధులతో సంబంధం ఉన్న అధికారులు,సిబ్బందిని బదిలీ చేయడానికి వీలులేదు .. ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా ఏ రాజకీయ పార్టీకైనా అనుకూలంగా వ్యవహరించినా లేదా ఆయా పార్టీలు నిర్వహించే ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నా,గిఫ్టులు, ఇతర లబ్దిలు పొందినా అలాంటి వారిపై సిసిఏ నిబంధనలు ప్రకారం ఐపిసి సెక్షన్ 171 మరియు 1951 ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని 123,129,134,134 ఎ నిబంధనలు ప్రకారం క్రమశిక్షణా చర్యలు తీసుకోవడం జరుగుతుంది ..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *