సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఎన్నికల కోడ్ రాకముందే భీమవరం పట్టణంలోని క్యాంపు కార్యాలయం నందు గత శనివారం ఉదయం స్థానిక ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్, ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) ద్వారా భీమవరం నియోజకవర్గానికి చెందిన 30 మంది లబ్ధిదారులకు 29 లక్షల 96 వేల రూపాయల చెక్కులను అందజెయ్యడం జరిగింది. లబ్దిదారులకు ప్రభుత్వానికి సహకరించిన ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ కు కృతజ్ఞలు తెలిపారు.
