సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: చిలకలూరిపేటలో నేడు ఆదివారం సాయంత్రం టీడీపీ, జనసేన, బీజేపీలు నిర్వహించిన ప్రజాగళం సభ కు లక్షలాది మంది మూడు పార్టీల అభిమానులు ప్రజలు తరలి వచ్చారు. ఈ బహిరంగ సభలో ప్రధాని మోదీని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ప్రశంసిస్తూ, ఆకాశానికి ఎత్తేశారు. ఇదే సమయంలో ముఖ్యమంత్రి జగన్ పై విమర్శలు గుప్పించారు. కానీ ప్రధాని మోడీ మాత్రం తన ప్రసంగంలో కేంద్రంలోని బీజేపీ ఆంధ్ర ప్రదేశ్ లో చేసిన అభివృద్ధి పథకాలు ఎక్కువ వివరించి .. జగన్ సర్కార్ ను సున్నితమైన విమర్శలతో సరిపెట్టడం, వేదికపై ఉన్న చంద్రబాబు, పవన్ ముఖ కవళికలలో ఇబ్బంది స్వష్టంగా వ్యక్తం అయ్యింది. రాష్ట్రంలో ఉన్న వైసీపీ పార్టీ కాంగ్రెస్ పార్టీ వేరు కాదని కాంగ్రెస్ లోనుండి పుట్టిందే వైసీపీ అన్నారు. ఇక్కడ ప్రభుత్వంలో ఒకరిని మించి ఒకరు అవినీతి చేస్తున్నారని , ఇక్కడ ప్రజలకు మరింత అభివృద్ధి కావాలంటే డబుల్ ఇంజన్ సర్కర్ అవసరమని అది ఎన్డీయే తో సాధ్యం అవుతుందన్నారు. ఇక చంద్రబాబు మాట్లాడుతూ.. మోదీ అంటే ఆత్మగౌరవం, ఆత్మవిశ్వాసం. ప్రపంచం మెచ్చిన గొప్ప నాయకుడు. కరోనా సమయంలో మన ప్రాణాలను కాపాడింది మోదీనే. అయితే దేశం దూసుకుపోతుంటే… మన రాష్ట్రం పూర్తిగా వెనుకబడిపోయింది.వికసిత్ ఆంధ్రప్రదేశ్ మనందరి లక్ష్యం కావాలి. ల్యాండ్, శాండ్, మైన్, వైన్ పేరుతో రాష్ట్రాన్ని దోచుకున్న దుర్మార్గుడు జగన్. జగన్ పాలనకు ముగింపు పలుకుదాం. ఎన్టీఏను గెలిపించుకుందాం.అభివృద్ధి లేక, అప్పుల బాధతో నలుగుతున్న ఏపీకి ఎన్డీయే కలయిక 5 కోట్ల మంది ప్రజలకు ఆనందం కలిగిస్తుందని పేర్కొన్నారు. ఇక పవన్‌కల్యాణ్ మాట్లాడుతూ..ఏపీలో ఎన్నికల కురుక్షేత్ర యుద్ధానికి మోదీ పాంచజన్యను పూరిస్తారని.. ఏపీలో జరుగబోయే ఈ ఎన్నికల్లో మోదీ ప్రభుత్వం హ్యట్రిక్ కొట్టబోతున్నామని పేర్కొన్నారు. 2014లో తిరుపతిలో వెంకన్న సాక్షిగా, 2024 విజయవాడ కనకదుర్గ సాక్షి పొత్తుగా పెట్టుకుని ఎన్డీయే కూటమి రాష్ట్రంలో ఘన విజయం సాధించబోతుందని పేర్కొన్నారు. వైసీపీ ప్రభుత్వం లిక్కర్, ఇసుక మాఫియా, భూ మాఫియా తో రాష్ట్రాన్ని దివాళా తీశారని ప్రకటించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు కరువయ్యాయనిచ ఏపీ గంజాయి కేంద్రంగా మారిందని,సీఎం సారాయి వ్యాపారిగా మారారని, పరిశ్రమలు తరలిపోయాయని అన్నారు. మొత్తానికి సభ విజయవంతం అయినప్పటికీ ప్రధాని మాట్లాడుతున్నప్పుడు మైక్ తరుచు ఆగిపోవడం తో చాల ఇబ్బంది ప్రత్యక్ష ప్రసారాలలో అసహనం ఎదురయింది.
