సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పశ్చిమ గోదావరి జిల్లాలో ఎన్నికల ప్రక్రియ నిర్వహణకు జిల్లా యంత్రాంగం పూర్తి సంసిద్ధంగా ఉన్నదని ఎన్నికల అధికారి, కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. ఎన్నికల ప్రక్రియకు సంబంధించి జిల్లాలోని వాలంటీర్లకు ఎటువంటి విధులను అప్పగించడం లేదు. ఎక్కడైనా ఎన్నికల విధుల్లో ప్రత్యక్షంగా, పరోక్షంగా వలంటీర్లు సహకరిస్తున్నారనే విషయం మా అధికారుల దృష్టికి వస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. షెడ్యూలు ప్రకటించిన తేదీ నుంచి ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకు అన్ని రాజకీయ పార్టీలు, పోటీలోనున్న అభ్యర్థులు ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ప్రకారం సభలు, సమావేశాలు, వాహనాలు అన్ని ముందస్తు అనుమతి పొంది నిర్వహణలో ఉంచుకోవాలి. బహిరంగ ప్రదేశాలు ప్రభుత్వ కార్యాలయాల్లో గుర్తించిన ఫొటోలు, బ్యానర్లు తొలగిస్తున్నాం. ప్రభుత్వ కార్యాలయాల్లో గుర్తించిన ఫొటోలను, పోస్టర్లను ఫ్లెక్సీలు, బ్యానర్లను , ప్రభుత్వ ఆస్తులపై పార్టీల రంగులు తొలగించడానికి చర్యలు చేపట్టాం.ఎన్నికలలో జిల్లాలో మూడు బెటాలియన్లను వినియోగిస్తాం. వీరికి అదనంగా 1,500 మంది పోలీస్ సిబ్బందికి విధులను కేటాయిస్తున్నాం. ఎన్నికల వ్యయ పరిమితులకు సంబంధించి ఎంపీ అభ్యర్థి రూ.95 లక్షలు, ఎమ్మెల్యే అభ్యర్థి రూ. 40 లక్షలు మించి ఖర్చు చేయరాదు’ అని ఆదేశించారు. ఈసారి ఎన్నికలలో వికలాంగులు (పీడబ్ల్యూడీ) 85 ఏళ్లు, అంతకుమించి ఎక్కువ వయసున్న ఓటర్లు ఇప్పుడు వారి ఇళ్ల నుంచి ఓటు వేసే అవకాశం కల్పించాం.జిల్లాలో నియమించబడిన వీడియో గ్రాఫర్లు, పొలిటికల్ పార్టీల ప్రతినిధులకు ఎన్నికల విధులకు సంబంధించి ఇప్పటికే శిక్షణ పూర్తీ చేశామని అన్నారు.
