సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: 10 ఏళ్ళు తరువాత మరోసారి ఏపీలో ఒకే వేదికపై ప్రధాని మోడీతో చంద్రబాబు, పవన్ పాల్గొన్న మొదటి సభ అంటే ఎలా ఉండాలి.. మరి చిలకలూరిపేట ఎన్డీయే పార్టీల ఆధ్వర్యంలో ప్రజాగళం సభ మరి టీడీపీ పెద్దలు చెప్పినట్లు 10- 12 లక్షలు మంది జనం కాకపోయిన ఇటీవల టీడీపీ సభలలో ఇదే పెద్ద సభ అని భావించవచ్చు.. కానీ ఈ సభ వల్ల టీడీపీ జనసేన కు రావలసినంత మైలేజి రాలేదు.. సరికదా ‘ప్రధాని మోడీ కి ఏపీ సీఎం జగన్ పట్ల ఉన్న వాత్యల్యము’ మరోసారి బహిర్గతం అయ్యింది. ప్రధాని ఎక్కడ జగన్ ను వ్యక్తిగతంగా విమర్శించలేదు సరికదా ఆయన సోదరి షర్మిల విషయంలో జాగ్రత్తగా ఉండాలని జగన్ షర్మిల ఒకటేనని , వైసిపి సర్కార్ మైనస్ ఓట్లు అన్ని షర్మిల కాంగ్రెస్ కు తీసుకొనివెళుతుందని, విశ్లేషణ చెప్పి.. జగన్ నెత్తిన పాలు పోశారు. దీనితో చంద్రబాబు పవన్ చేస్తున్న ప్రచారానికి చెక్ పెట్టారు. ఇక అమరావతి రాజధానిఫై ప్రధాని మోడీ మాట్లాడలేదు సరికదా? పవన్ తీవ్ర స్వరంతో వైసీపీ పాలనలో అవినీతి జరుగుతుంది.. ఇసుక లో.. అనగానే ప్రధాని లేచి పవన్ ను స్పీచ్ ఆపమని కోరి తనే మైక్ అందుకొని స్తంబాలు ఎక్కిన జనాన్ని క్రిందకి దిగామని ఆదేశాలు ఇవ్వడంతో.. పవన్ ఇక జగన్ ని విమర్శించకుండా స్వరం తగ్గించడం అందరు గమనించవచ్చు.. ప్రధాని మోడీ సమక్షంలో చంద్రబాబు తరుచు ఆయనకు దణ్ణం పెడుతూ ..మాట్లాడిన తీరు 14 ఏళ్ళు సీఎం చేసిన స్థాయిలో లేదు అని టీడీపీ వర్గాలే బాధ పడ్డాయి. పవన్ , చంద్రబాబు మోడీని తెగ పొగిడిన, మోడీ మాత్రం తన ప్రసంగం లో ఎక్కడ వారిని ప్రశంసించడం కానీ టీడీపీ ని చంద్రబాబు ను సీఎంగా గెలిపించండి అని కానీ ఎక్కడ అనలేదు.. అనేక సార్లు మైకులు మొరాయించాయి. ప్రధాని మోడీ అయితే పలుసార్లు తీవ్ర నిరుత్సాహానికి గురయ్యారు. ఆ మైక్ లు పని చేయకపోవడం పోలీసుల వైఫల్యమంటూ ఏకంగా ఏపీ పోలీసుల మీద ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశాడు వర్ల రామయ్య . ఇక సభ ముగింపులో ప్రధాని మోదీని సన్మానించడానికి కూడా ఒక జ్ఞాపిక కానీ ఏమి లేక ఉత్త చేతులుతో ఉండిపోయిన చంద్రబాబు, పవన్ కు ఝలక్ ఇస్తూ పురంధరేశ్వరి మాత్రం ప్రధాని కి శాలువా కప్పి శ్రీ వినాయక ప్రతిమ అందజేశారు. నిజానికి పవన్ కల్యాణ్ఇవ్వాలనుకున్న చందనం మాల, చంద్రబాబు ఇవ్వాలనుకున్న వెంకటేశ్వరస్వామి ప్రతిమకు అనుమతి నిరాకరించారని? తెలుస్తుంది.. అంటే ప్రధాని మోడీ సభకు వచ్చారు మనస్సు మాత్రం గతం .. గతం అంటూ వేధిస్తున్నట్లు ఉంది. ఎన్డీయే అధికారంలోకి వస్తే ఏపీకి ఇంకా ఎదో చేస్తామని.. ప్రత్యేక హోదా, విశాఖ ఉక్కుఫై మాట్లాడే దైర్యం కూడా ఆయన చెయ్యలేదు. వైసిపి నేత పేర్ని నాని చెప్పినట్లు ఎన్డీయే వారు పెట్టిన సభ మా వైసిపి కి చాల మేలు చేసింది ఇది సిద్ధం సభ నెంబర్ 5 అన్నారు...ఇది ఆలోచించవలసిందే.. సిగ్మాప్రసాద్ కాలమ్స్
