సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: గోదావరి జిల్లాలలో ఇప్పటి వరకు పెండింగ్ లో ఉన్న మరో 2 సీట్లకు జనసేన పార్టీ అభ్యర్థులను నేడు, పవన్ కళ్యాణ్ ప్రకటించారు. అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా పి.గన్నవరం, పోలవరం అసెంబ్లీ అభ్యర్థులను ఖరారు చేశారు. గిడ్డి సత్యనారాయణ పి.గన్నవరం, బాలరాజును పోలవరం నుంచి ఎంపిక చేశారు. తెలుగుదేశం, బీజేపీ, జనసేన పొత్తులో భాగంగా మొదట పి.గన్నవరం టికెట్‌ను టీడీపీకు కేటాయించిన విషయం తెలిసిందే. మహాసేన రాజేశ్‌ను అభ్యర్థిగా ఖరారు చేశారు. ఆ తర్వాత జరిగిన పరిణామాలతో ఆ సీటును జనసేనకు కేటాయించారు. అక్కడ తీవ్ర వ్యతిరేకత రావడంతో ఆ సిటు జనసేనకు ఇచ్చేసారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *