సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ప్రస్తుతఆధునిక కాలంలో ఆరోగ్యంపై ప్రతి ఒక్కరు శ్రద్ధ వహించాలని, ఎన్నో రోగాలు వస్తున్నాయని, నిర్లక్ష్యం వహిస్తే ప్రమాదాలు తప్పవని, వైద్యుల సహాయాలు తప్పనిసరిగా తీసుకోవాలని రాయలం కు చెందిన భారతీయ ఆక్యూ పంచర్ వైద్య నిపుణులు చినమిల్లి నాగేశ్వరావు అన్నారు. నేడు, శనివారం భీమవరం మార్నింగ్ కాఫీ క్లబ్ వారు ప్రజలకు ఆరోగ్య సేవలు అందిస్తున్న నాగేశ్వరరావు ను సత్కరించి వైద్య సలహాలు అడిగి తెలుసుకున్నారు. సింగిల్ నీడిల్ దేరపీ గురించి షుగర్, బిపి, టైరాయిడ్ ఇతర వ్యాదులు గురించి ఆయన వివరించారు. పెద్దగా ఖర్చు లేకుండా కూడా వైద్యం పొందవచ్చునని అన్నారు. కన్వీనర్ బొండా రాంబాబు క్లబ్ కో కన్వీనర్ ఓలేటి శ్రీనివాస గుప్తా, మావుళ్ళమ్మా గుడి మాజీ అధ్యక్షులు కారుమూరి సత్యనారాయణ మూర్తి, పిఅర్వో భట్టిప్రోలు శ్రీనివాసరావు, తటవర్తి నారాయణ మూర్తి, మానేపల్లి వెంక్కన్న బాబు, బొడ్డు వాసు, పులవర్తి రామకృష్ణ, గాదె నాగేశ్వరావు, కనగర్ల కిషోర్, గుండు సుమూర్తి, కార్మూరి బదరి, సంకా బాబు సభ్యులు పాల్గొన్నారు..
