సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భారతీయ కుటుంబాలలో పేద ధనిక తారతమ్యం లేకుండా వంట గది లో ఉల్లిపాయలకు ఉన్న అనుబంధం మామూలుదికాదు.. గతంలో పెరిగిన ఉల్లి ధరకు ప్రభుత్వాలు సైతం మారిపోయిన చరిత్ర ఉంది. ఎన్నికల ముంగిట గత నెల రోజులుగా మరల ఉల్లి ధరలు పెరుగుతున్న ఉల్లి ఎగుమతులపై కేంద్రం విధించిన ఆంక్షలు నేపథ్యంలో..తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రస్తుతం స్థానిక భీమవరం రిటైల్ మార్కెట్ లో కేజీ కి 30 నుండి 35 రూపాయల మధ్య లభ్యమౌతున్నాయి. లేకపోతె మరింత దారుణంగా పెరిగేవి. అయితే మరల రిటైల్ ఉల్లి ఎగుమతులపై ప్రభుత్వం విధించిన నిషేధాన్ని నిరవధికంగా పొడిగించింది. గతంలో ఈ మార్చి 31 వరకు నిషేధం అమలులో ఉండగా, ఇప్పుడు దానిని పొడిగించాలని నిర్ణయించారు. దీనికి సంబంధించి నోటిఫికేషన్ విడుదలైంది. ఎన్నికల సమయంలో ఉల్లి ద్రవ్యోల్బణం పెరగకుండా చూసేందుకు, దాని ఎగుమతిపై నిషేధాన్ని పొడిగించాలని నిర్ణయించారు. అంటే ఎన్నికలు పూర్తీ అయ్యేవరకు ఉల్లి ధరలలో పెద్ద మార్పు ఉండదు.. తరువాత మాత్రం …
