సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: గూడూరు కు చెందిన వైసీపీ సీనియర్ ఎమ్మెల్యే వరప్రసాద్ ఊహించని ట్విస్ట్ ఇచ్చారు. సీఎం జగన్ ఆయనకు ఈ సారి గూడూరు టికెట్ ఇవ్వలేనని ముందే చెప్పేయడంతో ఆయన గత నెల రోజులుగా జనసేన లో చేరటానికి ప్రయత్నించినా నేడు, ఆదివారం ఎవరు ఊహించని విధంగా బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈసారి, గూడూరు వైసీపీ టికెట్ మేరుగ మురళీకి అధిష్టానం కేటాయించడంతో తీవ్ర అసంతృప్తికి లోనైన వరప్రసాద్ ఎమ్మెల్యేగా పోటీచేయాల్సిందేనని భావించారు. ఈ క్రమంలో పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. ఢిల్లీ వేదికగా కాషాయ పార్టీలోకి వరప్రసాద్ ను కండువా కప్పిన కేంద్రమంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. అయితే సిట్టింగ్ సీటు ఇవ్వకపోయినా ఫర్లేదు కానీ.. తిరుపతి నుంచి ఎంపీగా పోటీ చేసేందుకు మాత్రం అవకాశం ఇవ్వాలని హైకమాండ్‌ను వరప్రసాద్ కోరినట్లుగా తెలుస్తోంది. వరప్రసాద్ 2014 ఎన్నికల్లో తిరుపతి లోక్‌సభ స్థానం నుంచి పోటీచేసి వైసిపి అభ్యర్థిగా గెలుపొందారు. ఆ తర్వాత 2019 ఎన్నికల్లో గూడురు నుంచి వైసీపీ ఎమ్మెల్యేగా కూడా గెలిచారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *