సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నేటి బుధవారం ఉదయం ఇడుపులపాయలో తండ్రి స్వర్గీయ వై యస్, సమాధి వద్ద కొద్దీ సేపు గడిపి తల్లి విజయమ్మ అస్సిసులు తీసుకోని సీఎం జగన్ తన ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. నేటి సాయంత్రం ప్రజలు వైసీపీ శ్రేణులు విశేషంగా హాజరు అయిన పొద్దుటూరులోని ‘మేమంతా సిద్ధం’బహిరంగ సభలో ప్రతిపక్షాలపై పదునైన విమర్శలు చేసారు. తాను ప్రజల సంక్షేమం కోసం 130 సారులు బటన్ నొక్కానని, ప్రజలు వచ్చే అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలలో అందరి బాగుకోసం వైసీపీ ఫ్యాను గుర్తుపై 2 బటన్స్ నొక్కి వైసీపీ ప్రభుత్వాన్ని రక్షించుకొని ఈ తోడేళ్ళ గుంపు ను తరిమి కొట్టాలని పిలుపు నిచ్చారు. రానున్న ఎన్నికల్లో పొరపాటు జరిగితే చంద్రముఖి మళ్లీ లకలక అంటుందని.. సైకిల్ మీద వచ్చి రక్తం తాగుతుందని చంద్రబాబును నమ్మితే మీ సంక్షేమ పథకాలను రద్దు చేసుకున్నట్టేనని అన్నారు. తనపై నాన్ లోకల్ చంద్రబాబు, దత్తపుత్రుడు, బీజేపీ, కాంగ్రెస్ యుద్ధానికి కలిసికట్టుగా వస్తున్నాయని ఇంకా అది సరిపోదని తన ఇద్దరు చెల్లమ్మలను తోడు తెచ్చుకొంటున్నారని ఎద్దేవా చేసారు.మా వివేకా చిన్నాన్నను అతిదారుణంగా చంపిన హంతకుడు బహిరంగంగా తిరుగుతున్నాడని ఆ హంతకుడికి మద్దతు ఇస్తున్నది. చంద్రబాబు, చంద్రబాబుకి సంబంధించిన యెల్లో మీడియా, రాజకీయ లబ్ది కోసం పరితపిస్తున్న నా చెలెమ్మలు కావడం దురదృష్టకరం అని ధ్వజమెత్తారు.. ఆ దేవుడు, ఆ ప్రజల్నే నమ్ముకున్నా.. ధర్మం, న్యాయాన్ని నమ్ముకున్నా అని అన్నారు.
