సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గంలో టికెట్ ను బీజేపీ అభ్యర్థి ములగపాటి శివ కృష్ణంరాజుకి కేటాయించడంతో గత రాత్రి నుండి నేటి గురువారం కూడా తెలుగు తమ్ముళ్లు రచ్చ రచ్చ చేస్తున్నారు. దీనిపై అక్కడ అభ్యర్థిగా ముందుగా ప్రకటించిన టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అనుచరులు భగ్గుమంటున్నారు. నల్లమిల్లి రామకృష్ణారెడ్డి నివాసం చేరుకున్న టీడీపీ కార్యకర్తలు టికెట్ నల్లమిల్లికే ఇవ్వాలని పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. టీడీపీ కరపత్రాలను జెండాలను పెట్రోల్ పోసి దగ్ధం చేశారు. అదే విధంగా పార్టీ గుర్తు అయిన సైకిల్ని కూడా మంటలో పడవేసి తమ నిరసనలు తెలిపారు కార్యకర్తలను నిలువరించేందుకు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఆయన తనయుడు మనోజ్ రెడ్డి ప్రయత్నాలు చేసారు.. చివరికి కార్యకర్తలు శాంతించి సమావేశం వద్దకు చేరుకున్నారు. అక్కడ నల్లమిల్లి మాట్లాడుతూ.. ఇక్కడ పార్టీ ని బ్రతికించడం కోసం కోసం నా కష్టాలను పోరాటాలను చూసి, రాష్ట్రంలో టీడీపీ క్యాడర్ కు నల్లమిల్లి ఆదర్శం అంటూ ఇక్కడ సభలో ప్రశంసించిన చంద్రబాబు ఈ టికెట్ మరల బీజేపీ కి ఇచ్చేస్తారని ఊహించలేదని , తన అభిమానులు ఎవరు ఆత్మహత్యలకు పాల్పడవద్దని ఇంకా సమయం ఉంది అంటూ.. కార్యకర్తలు ఆందోళన చెందవద్దంటూ పిలుపునిచ్చారు.
