సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్:రేపు గురువారం ఎంపీ రఘురామా కృష్ణంరాజు భీమవరం శివారు లోని తన నివాసంలో మధ్యాహ్నం 3న్నర నుండి స్థానికులకు అందుబాటులో ఉంటారు. నేడు, బుధవారం విజయవాడ చేరుకున్న ఎంపీ రఘురామకృష్ణరాజు కు విమానాశ్రయం లో టీడీపీ నేతలు స్వాగతం పలికారు. తదుపరి ఆయన శ్రీ కనకదుర్గమ్మ దర్శనం చేసుకొన్నారు. ఈనెల 5వ తేదీ న తెలుగుదేశం అధినేత చంద్రబాబు పాలకొల్లు పర్యటన లో ఆయన పాల్గొనే అవకాశం ఉందని సమాచారం. చంద్రబాబు సమక్షంలో టీడీపీ లో చేరతారని ? పశ్చిమ గోదావరి జిల్లా నుండి ఆయన ఎన్నికలలో ఎంపీ అభ్యర్థిగా లేదా ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసే విషయం ఆ రోజు అధికారికంగా వెలువడుతుందని టీడీపీ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి.
