సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం నియోజవర్గంలో స్థానిక ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ ప్రచారం లోప్రతి రోజు రాత్రి అనక పగలు అనక శరవేగంతో దూసుకొనిపోతున్నారు. ఇప్పటికే నియోజకవర్గంలో కీలక నేతలను స్వయంగా కలుస్తూ వారితో సమావేశాలతో పాటు క్యాడర్ తో ముఖాముఖీ లు ఇతర పార్టీల నుండి వచ్చే నేతలు క్యాడర్ ను చేర్చుకొంటూ వారికీ దిశానిర్దేశ్యం చెయ్యడం లో, ప్రజలను కలుస్తూ ప్రభుత్వ సంక్షేమాన్ని కొనసాగించాలంటే ఆలోచించి ఓట్లు వెయ్యాలని, గతంలో సదుపాయాలు ఇప్పటి తన హయాంలో వందల కోట్ల రూపాయల అభివృద్ధి పనులు వివరిస్తూ తన అపార అనుభవాన్ని క్రోడీకరిస్తున్నారు. నేటి బుధవారం ఉదయం నుండి రాత్రి వరకు భీమవరం మండలం గొల్లవానితిప్ప, గూట్లపాడు, కొత్త పూసలమర్రు, దొంగపిండి గ్రామాలలో ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ పర్యటన కొనసాగింది. దేవాలయాల వద్ద, డాబాల మీద పార్టీ నాయకులు కార్యకర్తలతో సమావేశమయ్యారు,( ఫై చిత్రాలలో చూడవచ్చు) నేడు బుధవారం స్థానిక 22వ వార్డు జనసేన పార్టీ నుండి పలువురు యువకులు వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారని పార్టీ కార్యాలయం ప్రకటించింది. .
