సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పట్టణంలోని స్థానిక అడ్వార్డ్ ట్యాంక్ పార్క్ వద్ద శ్రీ రామాలయం వైపు భీమవరం జనసేన, తెలుగుదేశం ,బిజెపి కూటమి ఎన్నికల ప్రధాన శిబిరాన్ని నేడు, గురువారం ఉదయం 9 గంటలకు ఎమ్మెల్యే అభ్యర్థి పులపర్తి రామాంజనేయులు (అంజిబాబు) ప్రారంభించి పూజాది కార్యక్రమాలు నిర్వహించారు. చలువ పందిళ్ళ లో ఏర్పాటు చేసిన ఈ శిబిరం ప్రారంభానికి తెలుగుదేశం పార్టీ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా టీడీపీ, జనసేన పార్టీల అడ్జక్షులు, తోట సీతారామ లక్ష్మి మరియు కోటికల పూడి గోవిందరావు , టీడీపీ పార్టీ రాష్ట్ర కోశాధికారి మెంటే పార్ధసారధి తదితర నేతలు ఆయా పార్టీల నేతలు హాజరు అయ్యి ఆయనకు శుభాశీస్సులు అందజేశారు. ఆయన మధ్యాహ్నం 12 గంటల వరకు శిబిరంలో ఉండి వచ్చే ఆహుతులతో కలసిపోయారు. ఈ సందర్భముగా అంజిబాబు మన సిగ్మా న్యూస్ తో మాట్లాడుతూ.. తాను జనసేన అభ్యర్థిగా టీడీపీ, బీజేపీ నేతల పూర్తీ సహకారంతో ఎన్నికల ప్రచారానికి సంసిద్ధం అవుతున్నానని, ఈనెల 10 వ తేదీ నుండి ప్రచారం ప్రజలలో విస్తృతంగా ప్రచారం లో పాల్గొంటానని తన గెలుపు ఫై తనకు ఏ మాత్రం అనుమానం లేదని ధీమా వ్యక్తం చేసారు.
