సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: అనారోగ్యంతో హైదరాబాద్ లోని తన నివాసం లో విశ్రాంతి తీసుకొంటున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ తెనాలి లో ఎన్నికల పర్యటన.. డాక్టర్స్ సూచన ప్రకారం మరో 7 రోజుల విశ్రాంతి అనంతరం ప్రారంభించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఇదిలా ఉండగా తన పార్టీ నుంచి పోటీ చేయనున్న మరో ఇద్దరు అభ్యర్థుల పేర్లను నేడు, గురువారం ఆయన ప్రకటించారు. అవనిగడ్డ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి జనసేన అభ్యర్థిగా మాజీ శాసనమండలి చైర్మెన్ ,మండలి బుద్దప్రసాద్‌ పేరును ఆ పార్టీ చీఫ్ పవన్‌ కల్యాణ్‌ ప్రకటించారు. బుద్ధ ప్రసాద్‌ ఇప్పటివరకు తెలుగుదేశం టికెట్ కోసం ప్రయత్నించి విఫలం కావడంతో ఆయన తాజగా జనసేన లో చేరి ఈ టికెట్ సాధించడం గమనార్హం, అలాగే రైల్వే కోడూరు అభ్యర్థిగా అరవ శ్రీధర్‌ను ఎంపిక చేశారు జనసేనాని. వీరిద్ది ఎంపికపై పార్టీ నేతలతో చర్చించి నిర్ణయం తీసుకున్నారు. .అయితే, రైల్వే కోడూరు స్థానానికి ఇప్పటికే యనమల భాస్కరరావు పేరును ప్రకటించారు. ఈయన అభ్యర్థిత్వంపై తీవ్ర అభ్యంతరాలు రావడంతో దాంతో అభ్యర్థి పేరును మార్చేశారు. భాస్కరరావు ప్లేస్‌లో అరవ శ్రీధర్‌ను ఎంచుకున్నారు. కాగా, ఇప్పటికే 20 స్థానాలు అభ్యర్థుల ప్రకటన పూర్తీ కావడంతో ఇక మిగిలిపోయిన పాలకొండ అసెంబ్లీ స్థానానికి ఒకటి రెండు రోజుల్లో అభ్యర్థిని ప్రకటించే అవకాశం ఉందని జనసేన నాయకులు చెబుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *