సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నరసాపురం పార్లమెంట్ వైసీపీ అభ్యర్థిని గూడూరి ఉమాబాల నేడు, గురువారం తాడేపల్లిగూడెం కడకట్ల లో ఉప ముఖ్యమంత్రి మరియు స్థానిక ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణతో కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఇంటింటా ప్రచారంలో పాల్గొన్నారు. వారికీ సీఎం జగన్ హయాంలో ఈ ఐదు సంవత్సరాలలో జరిగిన ప్రజా సంక్షేమ, అభివృద్ధిని వివరిస్తూ రాబోయే ఎన్నికల్లో రెండు ఓట్లు ఫ్యాన్ గుర్తుపై వేసి శాసన సభ్యునిగా, కొట్టు సత్యనారయణ ని, పార్లమెంట్ సభ్యురాలిగ తనని గెలిపించి సంక్షేమ అభివృద్ధిని కొనసాగించాలని కోరారు. స్థానిక ఫెయిత్ చర్చ్ లో యునైటెడ్ పాస్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో దివంగత నేత డా. వైఎస్. రాశేఖరరెడ్డి ,సోదరి వైఎస్ విమలమ్మ ను కలుసుకొని వారి అస్సిసులు తీసుకోవడం గమనార్హం. ఈ ప్రచార కార్యక్రమంలో పురపాలక సంఘ నాయకులు, మండల నాయకులు, మహిళలు,కార్యకర్తలు పాల్గొన్నారు.
