సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: తిరుపతి జిల్లా పరిధిలో నేడు, గురువారం ‘మేమంతా సిద్ధం బస్సు యాత్ర’ కొనసాగింది. నేటి, సాయంత్రం నాయుడుపేటలో జరిగిన భారీ బహిరంగ సభలో సీఎం జగన్ మాట్లాడుతూ.. . ‘‘ ఈ ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలు, ఎంపీలను ఎన్నుకునేందుకు జరుగుతున్నవి కావు. పేద సామాజిక వర్గ భవిష్యత్తును నిర్ణయించే ఎన్ని కలు. ఈ ఓటు కేవలం ప్రజా ప్రతినిధుల్ని ఎన్ను కునేందుకు కాదు.. మన తలరాతను, మన భవిష్యత్తులను మనంతటమనమే రాసుకునేందుకని గుర్తు ఉంచుకోండి’’ అని సీఎం జగన్ అన్నారు. ఈ ఎన్నికలలో ఆ దుష్ట చతుష్టయాన్ని ఓడించేందుకు మీరంతా సిద్ధమా? అని సీఎం జగన్ ప్రశ్నిస్తూ ఉత్సహ పూర్వకంగా ప్రసంగించారు. తన వర్గం వారితో పిర్యాదులు చేయించి వాలంటీర్లను అడ్డుకోవడంతో… పింఛన్ లు తీసుకోవడానికి ఎండలో వెళ్లి ఇప్పటివరకు 31 మంది వృద్దుల ప్రాణాలు పోతున్నాయని , దీనికి కారకుడు అయిన చంద్రబాబును హంతకుడు అనలేమా? అని ప్రశ్నించారు. రాజకీయాలు నిజంగా చెడిపోయాయి. ఏ స్థాయికి అంటే.. అవ్వా తాతలకు ఇంటి వద్ద ఇచ్చే పెన్షన్లను.. తాము చెబితేనే చంద్రబాబు ఆపించారని అహంకార ధోరణితో వాళ్ల పార్టీ ఎమ్మెల్యే ల అభ్య ర్థులు(రాజమండ్రి టీడీపీ అభ్య ర్థిఆదిరెడ్డి వాసు పేరు ప్రస్తావన) చెప్పారు. సిగ్గు లేకుండా చెప్పుకుంటున్నారో చూస్తున్నాం. మరి.. మరోసారి బాబును నమ్మొచ్చా? అని ఆలోచిం చండి. అని సీఎం జగన్ అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *