సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: తెలుగు రాష్ట్రాలలో ఎండలు మండిపోతున్నాయి. ప్రజలు ఈ ఎండలలో ప్రయాణాలు చేయాలంటేనే భయపడిపోతున్నారు. మరో ప్రక్క శుభకార్యాలు ఉన్నాయి, మరి ఛార్జీలు కాస్త ఎక్కు వైనా సరే.. ప్రయాణికులు ట్రైన్, బస్సు ల్లో ఏసీ తరగతులకు ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇక రైల్లో 3 టైర్ వరకు ఏసీ ప్రయాణికుల వెయిటింగ్ లిస్టు 100-200ల పైనే ఉంటోంది.మరోవైపు ప్రతిరోజు సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నంకు గోదావరి జిల్లాల మీదుగా దాదాపుగా 16 రైళ్లు వెళతాయి. అందులో ఐదు ఏసీ రైళ్లు ఉండగా.. ఒక్కో దాంట్లో 600 నుం చి 1000 వరకు ఏసీ బెర్తులు ఉంటాయి. అయినా కూడా గోదావరి జిల్లాల వారికీ ఈ రైళ్లలో రిజర్వే షన్ దొరకని పరిస్థితి నెలకొంది. మరోవైపు సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నంకు 2 వందేభారత్ రైళ్లు ప్రయాణిస్తాయి. వాటిలో పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రయాణికులకు అవకాశం లేకుండా చేసారు. ఇప్పటికి తాడేపల్లి గూడెంలో కూడా ఒక్క హోల్డ్ లేకపోవడం గమనార్హం.. వందేభారత్‌లో ఛార్జీలు అధికం అన్న విషయం తెలిసిందే. ఛైర్‌కార్ టికెట్ ధర రూ.1,665, ఎగ్జిక్యూ టివ్ రూ.3,120గా ధర ఉన్నా .. టికెట్లు దొరకట్లేదు.150కి పైగా వెయిటింగ్ లిస్టు ఉంటోంది. ఇక కాస్త ఏసీ చార్జీలు ఎక్కువ డిమాండ్ చేసిన ప్రవేటు బస్సులు, టాక్సీలు మాత్రమే ప్రయాణికులకు దిక్కు.. ఈసారి ఎన్నికలలో గోదావరి జిల్లాల లో ఎన్నికయ్యే ఎంపీ లు అదనపు ట్రైన్స్ సాధన ఫై ద్రుష్టి పెట్టాలి..
