సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం నియోజవర్గంలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా వచ్చే ఎన్నికలలో మరోమారు పోటీచేస్తున్న ప్రభుత్వ విఫ్, స్థానిక ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ భీమవరం మండలం లో తన ఎన్నికల ప్రచారాన్ని కొత్త పుంతలు త్రొక్కిస్తున్నారు. ప్రతి రోజు ఉదయం మధ్యాహ్నం వరకు ఎండలో సైతం ప్రచారంలో భాగంగా పల్లెలలో పెద్దలను, ప్రజలను కలుస్తూనే , ప్రతి రోజు సాయంత్రం చల్లబడ్డాక గతంలో గ్రామాలలో జరిగే రచ్చబండల తరహాలో గ్రామాల కూడలిలలో ప్రజలతో సమావేశం నిర్వహించి తన హయాంలో, సీఎం జగన్ సహకారంతో ఆయా గ్రామాలలో జరిగిన అభివృద్ధి , రోడ్డులు ,వంతెనలు, డ్రైన్స్ ,సచివాలయాలు నిర్మాణాలు, ప్రజలకు అందిన సంక్షేమాలు వాటికీ కేటయించిన నిధులతో సహా వివరిస్తూ ఓటర్లు సందేహాలకు సమాధానాలు ఇస్తూ, ఛలోక్తులు విసురుతూ నూతన ఒరవడి లో తన ప్రచారం కొనసాగిస్తున్నారు. గత గురువారం,రాత్రి వెంప గ్రామంలో పార్టీ సీనియర్ నాయకులు అల్లూరి కృష్ణంరాజు ఆధ్వర్యంలో జరిగిన పార్టీ నాయకులు కార్యకర్తల సమావేశంనికి విశేషంగా తరలి వచ్చిన జనసమూహాన్ని ఫై చిత్రంలో చూడవచ్చు.. గ్రంధి శ్రీనివాస్ కున్న మాస్ పాలోయింగ్ సభలలో, సమావేశాలలో ఆయననే స్టార్ క్యాంపెన్ గా తయారుచేసింది అని చెప్పవచ్చు.. సీఎం జగన్ 175 సీట్లలో, 25 ఎంపీ స్థానాలలో గెలిచి తిరిగి అధికారంలోకి వస్తారని .. ఓటర్లు వాస్తవాలు అలోచించి తనకు ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి భీమవరం చరిత్రలో కనివిని ఎరుగని మెజారిటీ తో గెలిపించాలని ఓటర్లను ఆయన అభ్యర్థిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *