సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పాలిసెట్ 2024 ప్రవేశ పరీక్ష ధరఖాస్తు గడువును ఏప్రిల్ 10వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు సాంకేతిక విద్యా శాఖ కమిషనర్ , సాంకేతిక విద్య, శిక్షణా మండలి ఛైర్మన్ చదలవాడ నాగరాణి తెలిపారు. నిజానికి గత శుక్రవారంతో ధరఖాస్తు గడువు ముగిసినప్పటికీ విద్యార్ధులు, వారి తల్లిదండ్రులు, విద్యార్ధి సంఘాల నుండి అందుతున్న వినతుల మేరకు ఎటువంటి అపరాధ రుసుము లేకుండా ఆన్‌లైన్ అప్లికేషన్‌లకు మరో ఐదు రోజలు గడువును పొడిగిస్తున్నామన్నారు. ప్రవేశ పరీక్ష ఏప్రిల్ 27వ తేదీన యధావిధిగా జరుగుతుందన్నారు. రాష్ట్రంలోని 87 ప్రభుత్వ, 182 ప్రైవేటు పాలిటెక్నిక్స్‌లలో ఏప్రిల్ 24 వరకు తరగతులు నిర్వహించి ఏప్రిల్ 25వ తేదీన గ్రాండ్ ఫ్రీ ఫైనల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ను సైతం నిర్వహిస్తామని నాగరాణి తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *