సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నరసాపురం లోక్ సభ వైసీపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న గూడూరి ఉమాబాల నేడు, శనివారం తణుకు నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం నిర్వహించి పలు సమావేశాలలో పాల్గొన్నారు. తణుకు పట్టణంలోని కమ్మ కళ్యాణ మండపంలో కాపు ఉద్యమ నేత మాజీ మంత్రివర్యులు ముద్రగడ్డ పద్మనాభం ముఖ్యఅతిధిగా హాజరైన కాపుల ఆత్మీయ సమావేశానికి పౌసరఫరాల మరియు వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి, కారుమూరి వెంకట నాగేశ్వరరావు తో పాటు నరసాపురం పార్లమెంట్ వైఎస్ఆర్సీపీ అభ్యర్దిని గూడూరి ఉమాబాల పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ వంకా రవీంద్రనాధ్ , ఏలూరు వైసీపీ లోక్ సభ అభ్యర్థులు కారుమూరి సునీల్ కుమార్, అధికార భాషా సంఘం అధ్యక్షులు విజయబాబుతో పాటు పెద్దసంఖ్యలో కాపు సోదరులు హాజరయ్యారు. వారికీ వక్తలు సీఎం జగన్ హయాంలో కాపులకు చెరుకూరిన లబ్ది ని సంక్షేమ పధకాలను వివరించారు. కాపులను హీనంగా చుసి, అనేక కేసులు పెట్టి జైలుపాలు చేసిన చంద్రబాబు పల్లకి మోస్తున్న జనసేన అధినేత ను నమ్మవద్దని కాపుల ఆత్మగౌరవం నిలుపుకొని ఓట్లు వెయ్యాలని ముద్రగడ పిలుపు నిచ్చారు. తదుపరి గూడూరి ఉమాబాల తణుకు పురపాలక సంఘంలోని 9వ మరియు 3వ వార్డులలో జరిగిన ఆత్మీయ సమావేశ కార్యక్రమంలో పాల్గొన్నారు. తదుపరి, దువ్వ గ్రామంలోని వైసీపీ పార్టీ కార్యాలయం మరియు సాలిపేటలో జరిగిన ఆత్మీయ సమావేశ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు సంఘం పెద్దలు, మరియు మహిళలు తదితరులు పాల్గొని తమ మద్దతు ఆమెకు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *