సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పశ్చిమగోదావరి జిల్లా భీమవరం బిజెపి ఎన్నికల కార్యాలయంలో సమావేశానికి ముఖ్యఅతిథిగా వచ్చిన ఏపీ ఎలక్షన్ కోఆర్డినేటర్ సిద్ధార్థ్ నాథ్ సింగ్ మాట్లాడుతూ…కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పథకాలను పేరు మార్చి తన పథకాలుగా చెప్పుకుని ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రజలను మోసం చేశాడని, కేంద్రం ఇచ్చిన ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకాన్ని పూర్తిగా వినియోగించుకోకుండా నీరుపేదలకు అన్యాయం చేశారని, ఈ 2024 ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ఆంధ్రప్రదేశ్ లో విజయం సాధిస్తుందని, నరసాపురం పార్లమెంట్ అభ్యర్థిగా భూపతి రాజు శ్రీనివాస్ వర్మ అని, ఇక మార్పులు చేర్పులు ఉండవని గతం 35సం. పైగా బిజెపిలో కొనసాగుతున్న ఈయన గెలుపొందడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. పార్లమెంట్ అభ్యర్థి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ మాట్లాడుతూ .. జగన్ రెడ్డి చేస్తున్న అరాచకాలను మద్యం ఇసుక మాఫియా అరికట్టాలంటే కూటమి గెలవాలని కూటమి అభ్యర్థిగా నన్ను ప్రజలు గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గారపాటి తపన చౌదరి,రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ చైర్మెన్, పాక సత్యనారాయణ. బీజేపీ పార్లమెంట్ కన్వీనర్, పేరిచర్ల సుభాష్ రాజు పాల్గొన్నారు.
