సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భారతీయ రైల్వే సంస్థ ఐఆర్సీటీసీ ఆధ్వర్యంలో దేశంలో ప్రముఖ పుణ్య క్షేత్రాల యాత్రకు ప్రత్యే క రైలు నడుపుతున్నారు. పూరి, కోణార్క్, గయ, వారణాసి, అయోధ్య, ప్రయాగరాజ్ పుణ్య క్షేత్రాలకు రైలు ప్రయాణిస్తుంది. ఈ నెల 27న ఉదయం10 గంటలకు సికిం ద్రాబాద్ నుంచి బయలుదేరి విజయవాడ, ఏలూరు, తాడేపల్లి గూడెం, రాజమహేంద్రవరం, సామర్లకోట మీదుగా ప్రయాణిస్తుంది.ఈ రైలు మే 6న తిరిగి సికింద్రాబాద్ చేరుకొంటుంది. దీనిలో ప్రయాణించాలనుకొనే భక్తులు వివరాల కోసం 92814 95848, 89773 14121 నంబర్లలో సంప్రదించాలి.
