సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు, గురువారం, మహాత్మా జ్యోతిరావు పూలే జన్మదిన వేడుకలు దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న నేపథ్యంలో భీమవరంలో స్థానిక వైసీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ ఆధ్వర్యంలో పలువురు వైసీపీ నేతలు మహాత్మా పూలె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భముగా ప్రభుత్వ విఫ్ గ్రంథి శ్రీనివాస్ మాట్లాడుతూ.. మహాత్మా జ్యోతిరావు పూలే గారి 197 వ జయంతిని ఈరోజు జరుపుకొంటున్నామని ఆ మహానుభావుడు చేసిన కృషి ఫలితంగా దేశంలో అణగారిన , వెనుకబడిన వర్గాల అభ్యున్నతి కి తదుపరి కాలంలో బాటలు పడ్డాయని , పూలె పేర్కొన్న సామజిక సమన్నాయం ఏపీలో సీఎం జగన్ ప్రభుత్వం పూర్తిస్థాయిలో అమలు చేసి చూపిస్తుందని ఎస్ సి ఎస్టీ లతో పాటు బిసి లకు అన్ని పదవులలో, ఎన్నికలలో అభ్యర్థుల కేటాయింపులో భాగస్వామిగా చేస్తుందని దేశానికీ ఆదర్శంగా నిలిచిందని పేర్కొన్నారు.ఈరోజు పవిత్ర ‘రంజాన్ పండుగ’ చేసుకొంటున్న ముస్లీమ్ సోదరులకు శుభాకాంక్షలు తెలియజేసారు, ఈ కార్యక్రమంలో గూడూరి జగదీష్, వైసీపీ పట్టణ అధ్యక్షుడు తోట భోగయ్య, కామన నాగేశ్వరరావు, గంటా సుందర్ కుమార్, కోడె యుగంధర్, జాంగా మాణిక్యాలరావు తదితర వైసీపీ నేతలు పాల్గొన్నారు.
