సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పట్టణంలో నరసయ్య అగ్రహారంలోని సున్ని జామియా మజీద్ లో నేడు, గురువారం ఉదయం జరిగిన రంజాన్ వేడుకలలో.. ఈద్ గాహ్ నమాజ్ లలో జనసేన జిల్లా అధ్యక్షులు కొటికలపూడి గోవిందరావు మరియు జనసేన పార్టీ తరపున కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి గా పోటీచేస్తున్న పులపర్తి రామాంజనేయులు పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భముగా ముస్లిం సోదరులకు ఈద్ ముబారక్ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం అంజిబాబు మాట్లాడుతూ.. పవిత్ర రంజాన్ వేడుకలలో పాల్గొనడం ఆనందంగా ఉందని , సమాజంలో ముస్లీమ్ లు ఆర్ధికంగా ఇంకా ఉన్నతిలోకి రావాలని ముస్లిం సోదరుల పిల్లలు ఉన్నత చదువులు చదువుకుని లక్ష్యాలను సాధించేదిశగా కృషి చేయాలని, తాము అధికారంలోకి వస్తే ఆ దిశగా అడుగులు వేస్తామని అల్లా ఆశీస్సులు మీకు ఉంటాయని అన్నారు.
