సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఈ సమ్మర్ సీజన్ ప్రారంభంలో విడుదలయిన డీజే టిల్లు సిరీస్ 2 సినిమా తెలుగు రాష్ట్రాలలో ప్రపంచ వ్యాప్తంగా కలెక్షన్స్ దుమ్ము లేపుతున్న విషయం అందరికి తెలిసిందే.. కుర్ర హీరో, సిద్దు జొన్నలగడ్డ డీజే టిల్లు సినిమాతో యూత్ కు మినహా ఫ్యామిలీ ఆడియన్స్ కు పెద్దగా పరిచయం లేకపోయిన ఒక్కసారిగా టిల్లు సిరీస్ 2 సిరీస్ విజయం తో స్టార్ హీరోలతో సమానమైన భారీ విజయాన్ని అందుకొన్నాడు. ఈ చిన్న బడ్జెట్ సినిమా భీమవరంలో 2వారలు పూర్తీ అయ్యేసరికి టౌన్ మొత్తంపై 41 లక్షలు పైగా కలెక్షన్ వసూళ్లు సాధించడం అందరిని నివ్వెరపరుస్తుంది. టోటల్ రన్ 60 లక్షల పైగా కలెక్షన్స్ సాధించే అవకాశం కనపడుతుంది. ప్రస్తుతం మల్టి ఫ్లెక్స్ మరియు పద్మాలయా థియేటర్స్ లో రన్ అవుతుంది. ఇదిలా ఉండగా చాలా కాలంగా టైం బాగోని యూత్ స్టార్ విజయ్ దేవర కొండా తాజా చిత్రం ఫ్యామిలీ స్టార్ సినిమా 8 రోజులకు 12 లక్షల గ్రాస్ కలెక్షన్ మాత్రమే వసూళ్లు సాధించడం గమనార్హం..
