సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: కోనసీమలో మరో తిరుమల గా ప్రసిద్ధి చెందిన వాడపల్లి లో శ్రీ వెంకటేశ్వర స్వామివారి కల్యాణోత్సవాలు రేపటి గురువారం నుండి ఘనంగా ప్రారంభం కానున్నాయి. ఇటీవల కాలంలో తెలుగు రాష్ట్రాల నలుమూలల నుంచి వచ్చే వేలాది మంది భక్తజనంతో దేవాలయాం కిక్కిరిసిపోతోంది. ప్రతి శనివారం ఏడు శనివారాల నోము ఆచరిస్తున్న గోదావరి జిల్లాల భక్తులు అధిక సంఖ్యలో స్వామివారిని దర్శించుకుని ఏడు ప్రదక్షిణలు నిర్వహించి మొక్కుబడులు చెల్లించుకుం టున్నారు. రేపటి గురువారం నుంచి వారం రోజులపాటు కల్యాణోత్సవాలు వైభవంగా నిర్వహించనున్నారు. గతంలో పెద్దాపురం మహారాజు రాజా వత్స వాయి తిమ్మ జగపతి మహరాజు శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయ నిర్వహణకు 1759లో 275 ఎకరాలను కానుకగా సమకూర్చారు. ఆయన హయాంలోనే కల్యాణోత్సవాలు ప్రారంభమయ్యాయి, ఈ నేపథ్యంలో…ఈ నెల 18న ఆంకురార్పణ, ధ్వజారోహణం, 19న స్వామివారి కల్యాణం, 20న పొన్నవాహనంపై గ్రామోత్సవం, 21న మహదాశ్వీరచనం, సదస్యం, 22న తెప్పోత్సవం, 23న మహా పూర్ణాహుతి, చక్రస్నానం, 24న స్వామివారి పుష్పోత్సవంతదితర కార్యక్రమాలతో స్వామి కల్యాణోత్సవాలు ముగుస్తాయి. భక్తులకు ఏ విధమైన అసౌకర్యం లేకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు దేవాలయ నిర్వాహకులు తెలిపారు.
