సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ప్రస్తుతం 24 క్యారెట్స్ బంగారం ధర సుమారు 75 వేలు కు అటు ఇటుగా ఉంది. ఇలా బంగారం ధర రోజు రోజుకు రాకెట్ లా ఫై పైకి దూసుకొని పోతుండటంతో, ఈ ఏడాది చివరికి 10 గ్రాములు 1 లక్ష రూపాయలు చేరిన షాక్ తినవలసిన అవసరం లేదని నిపుణులు అంటున్నారు. కానీ ఈ ఎఫెక్ట్ వజ్రాల ఆభరణాల కొనుగోలుపై తీవ్ర ప్రభావం పడటం నగలో వాడే వజ్రాల కన్న బంగారం రేటు నువ్వా నేనా? అన్నట్లు ఉండటంతో కొనుగోలుదారులపై అదనపు భారం పెరగకుండా నగల వర్తకులు వజ్రాభరణాల తయారీకి ఉపయోగించే బంగారం స్వచ్ఛతను తగ్గిస్తున్నట్లు తెలిసింది. 22, 18 క్యారెట్లకు బదులు 14 క్యారెట్ల బంగారంతో చేసిన డైమండ్‌ జువెలరీని అందుబాటులోకి తేవడంపై ఆభరణ వర్తకులు దృష్టిసారించారు. అంతేకాదు, బంగారం నగల కొనుగోలుకు వచ్చిన వారిలోనూ చాలా మంది ఇప్పుడు 22 క్యారెట్లకు బదులు 18 క్యారెట్ల మోడళ్ల కోసం ఆలోచిస్తున్నారు. దాంతో కల్యాణ్‌ జువెలర్స్‌, మలబార్‌ వంటి ప్రముఖ రిటైల్‌ ఆభరణ విక్రయ కంపెనీలు 14 క్యారెట్ల బంగారంతో కూడిన డైమండ్‌ జువెలరీతో పాటు 18 క్యారెట్ల స్వర్ణాభరణాల ఉత్పత్తులను ?అందుబాటులోకి తెస్తున్నట్లు తెలిసింది. అధిక ధరల కాలంలో తమ ఆదా సొమ్ము విలువను పెంచే మార్గంగా చూస్తున్నారని,ఈ స్వచ్ఛత ఆభరణానికి మన్నిక ఎక్కువ కావడం,రోజువారీగా వాడకానికి కూడా మరో కారణమని మలబార్‌ గ్రూప్‌ చైర్మన్‌ ఎంపీ అహమ్మద్‌ అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *